Newsమేఘా కృష్ణారెడ్డి భార్య సుధ లైఫ్‌స్టైల్ చూస్తే మైండ్ పోవాల్సిందే..!

మేఘా కృష్ణారెడ్డి భార్య సుధ లైఫ్‌స్టైల్ చూస్తే మైండ్ పోవాల్సిందే..!

మేఘా ఇంజ‌నీరింగ్ కంపెనీ ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండ‌లం డోకిప‌ర్రుకు చెందిన కృష్నారెడ్డి స్థాపించిన ఈ మేఘా కంపెనీ ఇప్పుడు ఇంజ‌నీరింగ్ రంగంలో క్రియేట్ చేస్తోన్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అటు తెలంగాణ‌లో అయినా.. ఇటు ఏపీలో అయినా ఎన్నో కీల‌క ప్రాజెక్టులు, నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తోన్న మేఘా కంపెనీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌కే షాక్ ఇస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కే ఇప్పుడు కృష్ణారెడ్డి బాగా కావాల్సిన వ్య‌క్తి అయిపోయారు. ఏ కీల‌క ప్రాజెక్టు చేప‌ట్టాల‌న్నా ఆయ‌నే ముందు ఇద్ద‌రు సీఎంల‌కు క‌నిపిస్తున్నారు. చాలా సింపుల్‌గా ఉండే ఆయ‌న భార్య గురించి తెలిస్తే మాత్రం దిమ్మ‌తిరిగి పోవాల్సిందే. ఆమెది విలాస‌వంత‌మైన లైఫ్‌స్టైల్ అని అంటారు. తాజాగా సుధారెడ్డి న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాలా వేడుకలో ఫ్యాషన్ షోలో త‌ళుక్కుమ‌న్నారు. ఆమె వ‌య‌స్సు 43 సంవ‌త్స‌రాలు. అయినా ఆమె మాత్రం 30 +లో ఉన్న‌ట్టే ఉంటారు. ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కూడా..!

సుధా రెడ్డి అటు మేఘా ఇంజినీరింగ్ , ట్రూజెట్ ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్‌గా కూడా ఉన్నారు. ఆమె ఎక్కువుగా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొని విరివిగా దానాలు, విరాళాలు ఇస్తూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌నా స‌దస్సుల‌తో పాటు ఎన్నో చారిటీ కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. 2018లో ఆమె 40వ పుట్టిన రోజు వేడుక‌లు కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో హైటెక్స్‌లో జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా డ్యాన్సులు చేశారు. వాళ్ల‌కే ఒక్కొక్క‌రికి అప్ప‌ట్లోనే కోట్లాది రూపాయ‌లు ఇచ్చారు. ఆ పుట్టిన రోజుకే రు.100 కోట్లు ఖ‌ర్చ‌యిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

హైద‌రాబాద్ మార్కెట్లో అమ్మే ప్ర‌తి ల‌గ్జ‌రి వ‌స్తువులు ఆమె ఇంట్లో ఉండాల్సిందే అంట‌. ఆమెకు ఫ్యాష‌న్ అంటే విప‌రీత‌మైన పిచ్చి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ఫ్యాష‌న్ షోల‌లో పాల్గొంటారు. ఆమె ఎడ‌మ‌వైపు ఓ ప‌న్ను స్థానంలో వ‌జ్రంతో చేసిన ప‌న్ను ఉంటుంది. ఆమె న‌వ్విన‌ప్పుడ‌ల్లా అది మెరుస్తూ ఉంటుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఎన్నోసార్లు చెప్పారు. ఆమె నిర్వ‌హించే ఫ్యాష‌న్ షోల‌కు దుబాయ్‌, అమెరికా, లండ‌న్‌ల నుంచి డిజైనర్లు వ‌స్తుంటారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news