దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సీరిస్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పటకి రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్ 95 శాతానికి పైగా పూర్తయ్యింది. అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అని యేడాదిన్నర కాలంగా ఊరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు డేట్లు వేసి మరీ రిలీజ్ అని చెప్పి.. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అనేది దానయ్యో లేదా రాజమౌళి చేతుల్లో లేదట. అది పెన్ స్టూడియో చేతుల్లో ఉందని టాక్ ?
మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాను రిలీజ్ చేసేలా నిర్మాత దానయ్య పెన్ స్టూడియో వాళ్లకు అగ్రిమెంట్ రాశారని అంటున్నారు. ఈ మేరకు దానయ్యకు భారీగా అడ్వాన్స్ కూడా ముట్టిందని తెలుస్తోంది. చెప్పిన డేట్‌కు ఆర్ ఆర్ ఆర్‌ను రిలీజ్ చేయకపోతే భారీ ఎత్తున పెనాల్టీ పెన్ వాళ్లకు దానయ్య కట్టాల్సి ఉంటుందంటున్నారు. మరోవైపు రాజమౌళిపై దానయ్యకు రోజు రోజుకు తీవ్ర అసహనం పెరిగిపోతోందంటున్నారు.
మరోవైపు పెన్ స్టూడియో నుంచి భారీ మొత్తంలో జీ గ్రూప్ వాళ్లు ఆర్ ఆర్ ఆర్ రైట్స్ తీసుకున్నారు. వాళ్లకు కూడా సమాధానం చెప్పుకోవాలి. ఇక సినిమా రిలీజ్ లేట్ అయితే ఇప్పటికే కొన్ని ఏరియాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన బయ్యర్ల ఒత్తిడి మామూలుగా ఉండదు. ఇక ఫైనాన్షియర్లకు భారీ ఎత్తున వడ్డీ కట్టాల్సి ఉంది. ఇన్ని సమస్యలతో దానయ్య సతమతమవుతుంటే రాజమౌళి మాత్రం అవేవి పట్టించుకోవడం లేదనే అంటున్నారు. ఇక తాజాగా మరోసారి రిలీజ్ డేట్ వాయిదా వేయడంతో రాజమౌళి చిక్కుల్లో పడేలా ఉన్నాడు