శైలజా ప్రియ.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మామిళ్ల శైలజా ప్రియ బుల్లితెర మీద నటిగా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు వేసి మెప్పించింది. శైలజకు తిరుగులేని అంద చందాలతో పాటు అద్భుతమైన అభినయం కూడా ఉంది. దీంతో ఆమెకు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. ఆమె గుంటూరు జిల్లాలోని బాపట్లలో జన్మించింది. శైలజ 1998లో మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమా లో మొట్టమొదటిసారిగా నటించింది.
జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన ప్రియసఖి సీరియల్ తో సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రియ. ఈ సీరియల్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత మరికొన్ని సీరియల్స్ చేశారు. హిందీలో యే హై జిందగీ అనే సీరియల్ లో యాక్ట్ చేశారు ప్రియ.అలాగే మాస్టర్, దొంగాట, గోకులంలో సీత, మావిడాకులు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, సూర్యుడు, సుప్రభాతం, రాజకుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, చిరునవ్వుతో, ఢమరుకం, కత్తి కాంతారావు, మిర్చి, ఇద్దరమ్మాయిలతో పిల్లా నువ్వు లేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, పండగ చేస్కో , విన్నర్, బాబు బంగారం, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.
ఇప్పటి వరకు తెలుగు, తమిళ్ భాషల్లో ఆమె 80 సినిమాల్లో నటించింది. ఇంతకు ఇంత అంద చందాలతో అందరిని ఎట్రాక్ట్ చేసే ఈ శైలజా ఆంటీ వయస్సు 43 సంవత్సరాలు..! ఇక శైలజకు సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు తెలుగింటి ఆడపడుచులా , తనదైన శైలిలో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫేస్ బుక్ పేజీలో ఏకంగా 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 2002లో ప్రియకి, ఎంవిఎస్ కిషోర్ తో పెళ్లి జరిగింది. 2003 లో వాళ్లకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు నిశ్చయ్. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆమె నటనకు బుల్లితెర మీద అనేక అవార్డులు దాసోహం అయ్యాయి. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ లో తనదైన స్టైల్ లో ఆట ఆడుతూ అందరిని మెప్పిస్తుంది.