టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ సినిమా నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ కెరీర్లోనే గొప్పగా నిలిచిపోదగ్గ సినిమాల్లో ఇది కూడా ఒకటి. నువ్వేకావాలి దర్శకుడు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. కోటి సంగీతం అందించారు. 2001 సెప్టెంబర్ 6న రిలీజ్ అయిన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
1- ఈ సినిమాతోనే దివంగత ఆర్తీ అగర్వాల్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. అప్పటి వరకు అమెరికాలో ఉన్న ఆమెను ఒ ఫొటో షూట్లో చూసిన ఇండియాకు రప్పించారు సురేష్‌బాబు, దర్శకుడు విజయ్ భాస్కర్. తర్వాత ఆమె ఇక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్ అయ్యింది.
2- నువ్వు నాకు నచ్చావ్ సినిమా 93 సెంటర్లలో 50 రోజులు ఆడింది.
3- అలాగే 100 రోజులు 57 కేంద్రాల్లో ఆడింది.
4- 175 రోజులు మూడు సెంటర్లలో పూర్తి చేసుకుంది.
5- ఎప్పుడు బుల్లితెరపై వేసినా కూడా నువ్వు నాకు నచ్చావ్కు అదిరిపోయే టీఆర్పీ వస్తుంది.
6- నువ్వే కావాలి తర్వాత విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్.
7- సురేష్ ప్రొడక్షన్స్ – స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
8- బ్రహ్మానందం – సునీల్ – ఎంఎస్. నారాయణ కామెడీ ఇందులో అల్టిమేట్‌గా నిలిచింది.
9- ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలవడానికి కథ, కథనాలు వెంకటేష్ కామెడీ, అర్తి అగర్వాల్ అందాలు, దర్శకుడు విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి మ్యూజిక్ హైలెట్ కీలకమయ్యాయి.
10- ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించినా కూడా సురేష్‌బాబు కొన్ని ఏరియాల్లో ఇతర డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రిలీజ్ చేశారు.