కార్లంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? ఇక, స్టార్ స్టేటస్ ను మెయింటెయిన్ చేసేవారి గురించి చెప్పాల్సిన పనేలేదు. సినిమా హీరో, హీరోయిన్స్‌కి చర్స్ కొనడం అంటే ఎంతో క్రేజో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త మోడల్స్‌ను కొనడం యంగ్ టైగర్‌కు మక్కువ. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకుంటారు ఎన్టీఆర్. ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు.
ఖరీదైన కార్లు మెయింటెన్ చేసే వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్.. అలాంటి కార్లు ఎక్కడున్నా, ఎంత ఖర్చయినా వాటిని ఇష్టంగా తెప్పించుకుంటారనే పేరుంది. అయితే నచ్చిన కారు కొనడమే కాదు.. దానికి తగ్గట్టే తనకు నచ్చిన నెంబర్ బోర్డ్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు తారక్.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ కార్లన్నిటికి 9999 నెంబర్ వాడతాడు. బహుశా ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. యంగ్ టైగర్ తన దగ్గర్ ఉన్న కార్లు అన్నింటికి ఒకే నెంబర్ ఎందుకు వాడతాడు అనేది మాత్రం చాలా మందికి అర్థం కాని విషయం. అయితే దీని వెనక ఓ బలమైన సెంటిమెంట్ ఉందట.
చాలా సార్లు తనకు సెంటిమెంట్స్ లేవని చెప్పిన తారక్‌కి.. 9 అంకె బాగా ఇష్టం అట. అంతేకాదు తాత కారు నెంబర్ 9999 అలాగే తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నెంబర్ వాడేవారని.. అందుకే తను 9 నెంబర్ అంటే అంత ఇష్టమని తారక్ పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు. తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @తరక్9999 అని ఉంటుంది.