మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమా ఏకంగా మూడు సంవత్సరాల పాటు షూటింగ్‌లోనే ఉండి.. రిసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కొరటాల చిరుకు కథ చెప్పడం… షూటింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్ అవ్వడం.. ఆ తర్వాత హీరోయిన్ కోసం సంవత్సరం పాటు వెతికి వెతికి చివరకు కాజల్‌ను సెట్ చేయడంతోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత కొరటాల తీసిన సీన్లే తీస్తుండడం కూడా చిరుకు అసహనం తెప్పించింది. చివరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ సినిమాలోకి రామ్ చరణ్ పాత్రను కూడా తీసుకు వచ్చారు. ఇక నిరంజన్ రెడ్డి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా ప్రారంభమే ఎంతో కాలం అయినా.. కూడా విడుదలకు మాత్రం ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ వస్తోంది. నిజానికి సినిమా గత ఏడాదిలో విడుదల అవ్వాలి. కానీ, కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. అయితే ఏది ఏమైనప్పటికీ.. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాకు సంబంధించి ఇంకొన్ని పనులు పూర్తి కాలేదట. దీంతో ఈ సినిమా ఇప్పట్లో విడుదలకు కష్టమేనని తెలుస్తోంది.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు బడా సినిమాలు ఉన్నాయి. దీంతో ఆ సమయంలో కూడా ఆచార్యను విడుదల చేసే అవకాశం లేదు. సో.. ఈ సినిమాని ఎట్టి పరిస్దితిలోనూ వచ్చే ఏడాది సంక్రాంతిలోపే విడుదల చెయ్యాలి.. మరి చూడాలి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందొ..!!