పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు సెట్స్ మీదకు ఎక్కిస్తున్నారు,పవన్ రీ ఎంట్రీ తర్వాత చకచకా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షుల ముందుకు వచ్చిన పవన్ ఇప్పుడు ఒకవైపు భీమ్లానాయక్..మరో వైపు హరిహర వీరమల్లు చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ వెంటనే సురేందర్ రెడ్డి సినిమా, హరీష్ శంకర్ సినిమాలతో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక పవన్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాను శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు విషయంలో ఫస్త్ నుండి కూడా పవన్ కు డైరెక్టర్ క్రిష్ కు మధ్య ఓ గ్యాప్ వస్తుందని టాక్. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇంటర్వెల్ పోర్షన్ పవన్‌కు అంతగా నచ్చలేదని..దీంతో స్క్రిప్ట్‌లో సజేషన్స్, మార్పుల కోసం పవన్ కు జాన్ జిగిడి ఓస్త్ అయిన త్రివిక్రమ్‌ను రంగంలోకి దించాడట.
అయితే ఇక్కడ షాకింగ్ ఏంటంటే.. డైరెక్టర్ క్రిష్ కు తన సినిమా స్క్రిప్ట్ విషయంలో మరొకరు ఎంటర్ అయితే అసలు నచ్చదు. అప్పుడు మణికర్ణిక సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అయితే మరిప్పుడు పవన్ కోరిక మేరకు త్రివిక్రమ్‌కు క్రిష్ తన సినిమా స్క్రిప్ట్ చేంజ్ చేయడానికి ఒప్పుకుంటాడా..?? లేదా..?? అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. ఈ మ్యాటర్ సోహల్ మీడియాలో లీక్ కావడంతో ఈ ఇష్యూ హాట్ టపిక్ గా మారింది. మరి చూడాలి క్రిష్ ఏం చేస్తాడొ..?