Megastar Chiranjeevi’s prestigious 150th project Khaidi no 150 still earning decent collections at the domestic boxoffice.
సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. నాలుగో వారంలోనూ సంతృప్తికరమైన వసూళ్లు రాబడుతోంది. ఇతర చిత్రాలో బరిలో ఉన్నప్పటికీ.. వాటికి ధీటుగా పోటీనిస్తూ దూసుకెళుతోంది. విశేషం ఏమిటంటే.. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా అంచనాలకు మించే డీసెంట్ కలెక్షన్లు కలెక్ట్ చేస్తోంది. తాజాగా ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ఈ మూవీ కలెక్షన్లు వివరాలే అందుకు నిదర్శనం.
వారి లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో రూ.76.15 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆ తర్వాత మూడు రోజుల్లో రూ. 1.27 కోట్లు కలెక్ట్ చేసింది. 20 రోజుల తర్వాత కూడా భారీ పోటీలో, అందునా వీక్ డేస్‌లో అంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా విశేషమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో.. మొత్తం 23 రోజుల్లో ఈ సినిమా ఏపీ, తెలంగాణాల్లో కలుపుకుని రూ. 77.42 కోట్లు కలెక్ట్ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇవ్వడంతో.. సినీ ప్రేమికులు ఈ చిత్రాన్ని పదేపదే చూస్తున్నారని, అందుకే బరిలోవున్న ఇతర చిత్రాలకంటే ‘ఖైదీ’నే అత్యధిక వసూళ్లతో దూసుకెళుతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏరియాల వారీగా 22 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 20.05
సీడెడ్ : 14.97
ఉత్తరాంధ్ర : 12.50
ఈస్ట్ గోదావరి : 7.93
వెస్ట్ గోదావరి : 5.88
కృష్ణా : 5.57
గుంటూరు : 7.20
నెల్లూరు : 3.32
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 77.42 కోట్లు (షేర్)