టాలీవుడ్‌లో బాహుబలి సీరిస్ సినిమాలతో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి – ది కంక్లూజన్ సినిమా అయితే తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాకుండా.. ప్రభాస్ క్రేజ్‌ను కూడా ఎక్కడికో తీసుకుపోయింది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ మళ్లీ పాన్ ఇండియా రేంజ్‌లో సాహో సినిమా చేశాడు. ప్రభాస్ ఫ్రెండ్స్ అయిన యూవీ క్రియేషన్స్ వాళ్లు భారీ బడ్జెట్‌తో సాహోను తెరకెక్కించారు. బాహుబలి – ది కంక్లూజన్ సినిమా తర్వాత మరోసారి ప్రభాస్ రెండేళ్ల భారీ గ్యాప్ తీసుకుని సాహో చేశాడు.
దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ అయిన సాహోకు రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల కథానాయిక శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది. 2019 ఆగస్టు 30న రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తయ్యింది. అయితే ఈ సినిమాపై రిలీజ్‌కు ముందున్న అంచనాలతో పోలిస్తే వచ్చిన టాక్ మాత్రం మిశ్రమం అనే చెప్పాలి.
దర్శకుడు సుజీత్‌కు మేకింగ్‌లో అంత అనుభవం లేకపోవడం కూడా మైనస్ అయ్యింది. సినిమా అంచనాలు అందుకోలేకపోవచ్చు కాని.. మరీ అంత డిజాస్టర్ అయితే కాదనే చెప్పాలి. ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రు. 433 కోట్లు. కొందరు ఇంకాస్త తక్కువే వచ్చాయంటారు. ఎలా లేదన్నా రు. 400 కోట్ల వసూళ్లు అయితే సాహో సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు ప్రభాస్‌ను వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు.
ఈ సినిమా తర్వాతే ప్రభాస్‌కు వరుస పెట్టి బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు యూవీ వాళ్లు రు. 350 కోట్లు పెట్టామని చెప్పారు. ఇక ప్రభాస్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కట్టిన 3 స్క్రీన్స్ మల్టీఫ్లెక్స్ సైతం సాహోతోనే ప్రారంభమైంది. అదే ఈ సినిమా ఏ వెయ్యి కోట్లో వసూళ్లు రాబట్టి ఉంటే హిట్ అయ్యేది. ఏదేమైనా తెలుగు సినిమా వాళ్లు చేసిన పెద్ద ప్రయత్నం ఈ సాహో..!