అక్కినేని కోడలు సమంత ఇటీవల వ్యవహరితీస్తోన్న తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఎన్నో యేళ్ల పాటు తన తొలి సినిమా హీరో చైతునే ప్రేమించి నాలుగేళ్ల క్రితం ఇరువైపులా కుటుంబాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసింది. ఇటీవల తనకు ఇష్టమైన కుక్క ఫోటో పెట్టి దానికి క్యాప్షన్‌గా నువ్వైనా నాతో జీవితాంతం ఉండూ అంటూ అనేక సందేహాలకు తావిచ్చేలా చేసింది.
మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి బంధం విచ్ఛిన్నమైందని.. వీరు త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారని పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనివైపు నుంచి అటు చైతు, ఇటు సామ్ ఎవ్వరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు సమంత తనంతట తాను స్వయంగా తాను కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. ఇక తన సోషల్ మీడియాలో తాను ఎంచుకున్న దారి తప్పు… దానికి తానే కారణం అని కూడా మరో సందేహాస్పద కామెంట్ చేసింది.
మరోవైపు వీరిద్దరి మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చేసిందని… వీరు ఇక కలిసి ఉండే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సమంత ఇప్పటికి కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఉంది. చైతు ఇంకా హీరోగా నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ ఇగో క్లాషెస్ వల్లే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్న టాక్ ఉంది. మరోవైపు ఇటీవల నాగ్ పుట్టిన రోజు సందర్భంగా సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా ఈ సందేహాలు ఆగడం లేదు.
ఇటీవల నాగచైతన్యకు ఓ టాప్ డైరెక్టర్ కథ చెప్పేందుకు ఫోన్ చేస్తే కొద్ది రోజుల పాటు తనను డిస్టర్బ్ చేయవద్దని.. నాకు ఉండాల్సిన టెన్షన్లు చాలా ఉన్నాయని చెప్పి ఫోన్ పెట్టేశాడని అంటున్నారు. ఇక సమంత ఇప్పుడు సింగిల్‌గా మాన్ సూన్ సీజన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఏదేమైనా సమంత – చైతు స్పందించి క్లారిటీ ఇవ్వకపోతే వీరి మధ్య ఏదో జరుగుతుందన్నది మరింత బలపడుతుంది