సినీ ఇండస్ట్రీలో నటించే నటులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక హీరోయిన్లు, హీరోలు అయితే నిర్మాతలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారం నుంచి వేసుకొనే బట్టల వరకు ఏం కావాలన్నా నిర్మాతలే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు హీరోయిన్లతో పాటు వచ్చే అసిస్టెంట్ లకు కూడా అదనంగా నిర్మాతలు డబ్బులను సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమాకు పెట్టే బడ్జెట్టే చాలా ఎక్కువ అవుతుంది అని ఆలోచించే నిర్మాతలకు, ఇదంతా కూడా ఒక పెద్ద భారం అని చెప్పవచ్చు.
ఇక అందులో భాగంగానే ఒక స్టార్ హీరోయిన్ కి అప్పట్లో స్నానం చేయడానికి బిస్లరీ వాటర్ ను కూడా తెప్పించారట నిర్మాతలు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ..తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అప్పట్లో మంచి గుర్తింపు పొందిన శ్రీవిద్య. ఇక ఈమె సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఎగబడీ మరీ వెళ్లేవారట. అంతలా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేది శ్రీవిద్య. అందుకు తగ్గట్టుగానే సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు కూడా ఈమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే , ఒక తెలుగు చిత్రం షూటింగ్ కోసం అవుట్ డోర్ షూటింగ్లో భాగంగానే గోదావరి కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రదేశంలో అన్ని వసతులు ఉన్నప్పటికీ, స్నానానికి మాత్రం నీరు లభించేది కాదు.
అప్పుడే వరదలు వచ్చిన సమయంలో గోదావరి నీరంతా బురదమయం అయ్యింది. స్నానం చేయాలి అంటే ఒక కాయను బాగా అరగదీసి, ఆ నీళ్ళలో వేస్తే బురద నీళ్లలో ఉన్న బురద మొత్తం అడుక్కు పోయి, పైన తెల్లని తేట లాగ నీళ్ళు తేలతాయి. ఇక సినిమా సహాయకులు కొంతమంది ఇలా చేసి మిగతా వారందరికీ నీటిని అందించడం చేశారు. కానీ శ్రీవిద్య మాత్రం ఈ నీటితో స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. పైగా ఈ నీటితో స్నానం చేస్తే తన అందం చెడిపోతుందని , ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆమె పేచీ పెట్టడంతో నిర్మాతలు అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బిస్లరీ వాటర్ ను ఆమె స్నానానికి అందించారు.
అప్పట్లో బిస్లరీ వాటర్ ఒక లీటర్ ఆరు రూపాయలు ఉండేది. పూటకు రెండు బకెట్ల చొప్పున పొద్దున, సాయంత్రం ఆమెకు సినిమా షూటింగ్ అయిపోయే వరకు స్నానానికి ఈ నీటిని అందించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.