తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాతగా గుర్తింపు పొందిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. తన తండ్రి బ్యాక్గ్రౌండ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటిసారిగా అల్లుడు శీను అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇక తన నటనతో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు అని చెప్పవచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకునే కథలు కూడా చాలా భిన్నంగా ఉండటంతో, చాలా సినిమాల వరకు ఇతర భాషల్లో రీమేక్ చేయబడ్డాయి అని చెప్పవచ్చు.
ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ కు కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాదు ఇతర భాష రాష్ట్రాలలో కూడా, అభిమానులు ఉండడానికి గల కారణం, ఆయన సినిమాలు ఇతర భాషల్లోకి కూడా రీమేక్ కావడమే. ఇకపోతే ప్రస్తుతం మన స్టార్ హీరోలు తెలుగులో నటించిన సినిమాలను, హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయడానికి ఆ సినిమా రీమేక్ రైట్స్ ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు పదికి పైగా సినిమాలలో నటించాడు. ఇక తన సినిమాల ద్వారా ఎంత సంపాదించాడు అనే ప్రశ్న అందరిలో కలుగుతోంది. ఆయన ఆస్తుల విషయానికి వస్తే, ఒక్కొక్క సినిమాకు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
ఇప్పటివరకు ఆయనకున్న స్థిరాస్తి విలువ ఏకంగా 250 కోట్ల రూపాయలు. అంతేకాదు పదిహేను కోట్ల రూపాయల విలువ చేసే రెండు అతిపెద్ద బంగళాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రెండు బంగళాలు కూడా అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన ఉండటం గమనార్హం.ఇక 3 సూపర్ లగ్జరీ కార్ లతోపాటు మరో మూడు సూపర్ బైక్ లు కూడా ఉండడం గమనార్హం.