సాధారణంగా ప్రతి ఒక్కరికి చిరకాల కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికను తీర్చుకోవడానికి కష్టాలు పడినా సరే నెరవేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలోని వాళ్లకైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళ కంటూ ఒక ప్రత్యేక కోరికలు ఉండడంతో పాటు వాటిని నెరవేర్చుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తూ ఉంటారు. ఉదాహరణకు సూపర్ స్టార్ కృష్ణ కూడా తన చిరకాల కోరికను ఇటీవల వ్యక్తపరిచాడు. అదేమిటంటే ఆయన తన కొడుకుతో కలిసి బాలీవుడ్ సినిమాల్లో నటించాలని, కృష్ణ చివరి కోరిక అట. అయితే మన మెగాస్టార్ కూడా ఒక తీరని చిరకాల కోరిక ఉందట. అది ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
మెగాస్టార్ చిరంజీవి విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, తరువాత హీరోగా ఎదిగాడు. అంతేకాదు మెగాస్టార్ అనే ఒక ముద్ర ను కూడా వేసుకొని, తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రాజకీయాల్లో కూడా వెళ్లి సీఎం కావాలనే తపనతో ప్రజా రాజ్యం అనే పార్టీని స్థాపించి, కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక కేంద్ర మంత్రిగా కొంతకాలం పాటు కొనసాగారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఆయన కొనసాగినంత కాలం ఎటువంటి మచ్చను కూడా తెచ్చుకోకపోవడం గమనార్హం.
అయితే ఆయన అభిమానులు మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారట.. కానీ రాజకీయాల్లోకి రావడం చిరంజీవికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెడితే, తెలంగాణకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరికి దూరం కావాలి. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
భారతదేశం అంతట ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు. రాజకీయాల్లోకి వచ్చి అందరికీ దూరం అవడం కన్నా , సినీ ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా ఉండటమే ఆయనకు గౌరవం అంటూ కొంతమంది అనడమే కాకుండా ఆయన అభిప్రాయం కూడా ఇదేనని సినీ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.