సినీ ఇండస్ట్రీలో చాలామంది తొలి చూపులోనే ప్రేమలో పడి , ఆ తర్వాత గాఢంగా ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్న వారిని కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఒకే సినిమాలో నటించి కపుల్స్ గా మారిన జంటలు అనగానే ముందుగా గుర్తొచ్చేది సమంత అలాగే నాగ చైతన్య.. ఎందుకంటే వీరిద్దరి ప్రేమ ఎంత అద్భుతంగా ఉండేదో , ప్రస్తుతం వీరు కపుల్స్ గా మారిన తర్వాత దాంపత్య జీవితం కూడా అంతే అందంగా ఉండడంతో పాటు, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్న జంట అని చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రేక్షకుల ముందు తెరపై భార్యాభర్తలుగా నటించిన వీరు , నిజజీవితంలో కూడా భార్య భర్తలు అయితే ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు అనుకుంటుండగానే, చివరికి వారే భార్యాభర్తలుగా మారి ప్రేక్షకుల కోరిక కూడా నెరవేరుస్తూ ఉంటారు. అలా నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు ఒకే సినిమాలో నటించి, చివరికి దంపతులు గా మారారు అని ఈ విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం.
1. సమంత – నాగ చైతన్య:
ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత, తొలిచూపులోనే నాగచైతన్యకు పడిపోయిందని చెప్పవచ్చు. రెండు మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని, చివరికి పెద్దల సమక్షంలో ఒక ఇంటివారయ్యారు. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతోంది.
2. అమల – నాగార్జున:
శివ చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరూ, ఒకరినొకరు ప్రేమించుకుని ఆ తర్వాత దంపతులు గా మారారు.
3. జీవిత – రాజశేఖర్:
వీరు కూడా వెండితెరపై ఒకే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమించుకుని 1991వ సంవత్సరంలో దంపతులు గా మారారు.
4. మహేష్ బాబు- నమ్రత:
వీరు కూడా వెండితెరపై పరిచయం అయ్యారు .తర్వాత ప్రేమించుకొని ,పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.