జగపతి బాబు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథానాయకుడిగా ఎంత గుర్తింపు పొందారో ప్రతినాయకుడిగా అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు జగపతి బాబు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్ రొమాంటిక్ హీరో జగపతి బాబు. ఆయన నటన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను బాగా ఆకట్టుకుంటుంది.విలన్, కేరెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో దక్షిణాది భాషల్లో దూసుకెళ్తున్న నటుడు జగపతి బాబు.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు. అనుకోకుండా సినిమాలకు కొంచం గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామగా మెప్పిస్తున్నారు .
ప్రస్తుతం జగపతి బాబు చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సలర్ మూవీ, వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమా, టక్ జగదీష్ సినిమా, అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న సినిమా, కన్నడ లో ఒక సినిమా, మహా సముద్రం సినిమా, లక్ష్య సినిమా, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తుండడంతో.. జగపతి బాబు రెమ్యునరేషన్ బాగా పెంచేసాడని టాక్ వినిపిస్తుంది. అంతకు ముందు ఒక్కో సినిమాకి కోటి రూపాయలు తీసుక్నే ఈయన ఇప్పుడు ఆ సంఖ్య ని భారీగా పెంచేసాడట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమకి మూడు నుండి నాలుగు కోట్ల మధ్య తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో నటిస్తూ చాలా బిజీ అయిపోయాడు.