టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.
ఇక రామ్‌చరణ్‌ని చాలామంది చరణ్, చెర్రీ అని పిలుస్తుంటారు అన్న సంగతి మనకు తెలిసందే. కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం ‘మిస్టర్ సి’ అని పిలుస్తుంటారు. అంతేకాదు..రామ్‌చరణ్‌కి సంబంధించి ఉపాసన పెట్టే పోస్టుల్లోనూ ఆమె రాం చరణ్ ని ‘మిస్టర్ సి’ అంటూ మెన్షన్ చేస్తుంది. అందరు ‘మిస్టర్ సి’..అంటే చరన్ లో ఫస్ట్ లెటర్ “C” కదా అందుకే అలా పిలిస్తుంది ఏమో అనుకున్నారు. కానీ అసలు మ్యాటర్ అది కాదట.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెరకెక్కుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు” రియాల్టీ షోలో పాల్గొన్న రామ్‌చరణ్ ‘మిస్టర్ సి’ వెనకాల ఉన్న కారణాన్ని రివీల్ చేశారు. ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం కర్టెన్ రైజర్ కార్యక్రమానికి రామ్‌చరణ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా “Mr.C” గురించి చరణ్‌ను ఎన్టీఆర్ అడిగాడు. నీ గురించి రాసే ఉపాసన సోషల్ మీడియా పోస్టుల్లో చూస్తే “Mr.C” అని ఉంటుంది… ఏంటీ”Mr.C” అని అడిగాడు తారక్.
దానికి చరణ్ సమాధనమిస్తూ..ఓ సారి ఉపాసన తాను లాస్ ఏంజెల్స్ కి ట్రిప్ వెళ్లినప్పుడు అక్కడ ఓ మిస్టర్ సీ అనే హోటల్ ఉండేదట. అందులో వాళ్లిద్దరు డిన్నర్ చేశారట. ఈ సందర్భంగా అక్కడి చెఫ్‌తోనూ సరదా చాట్ జరిగిందని ఈ క్రమంలో ఉపాసన ఆ హోటల్ నచ్చడంతో, ఆ సందర్భంగా జరిగిన సరదా సంఘటన కారణంగా తనకు మిస్టర్ సీ అనే పేరు పెట్టిందని, అప్పటి నుంచి మిస్టర్ సీగా పిలుస్తుందని చెప్పారు రామ్‌చరణ్.