Balayya’s Gautamiputra Satakarni movie has earning very well in it’s fourth week run. Accoring to trade, this film has crossed 65 crore mark at the worldwide boxoffice which is record figure in Balayya’s career.
జనవరి 12వ తేదీన తన ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ద్వారా బాక్సాఫీస్‌పై బాలయ్య ప్రారంభించిన దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు చాలా ఏరియాల్లో సంతృప్తికరమైన కలెక్షన్లు కలెక్ట్ చేస్తోంది. వీకెండ్స్‌లోనే కాదు.. వీక్ డేస్‌లో కూడా ఈ చిత్రం చెప్పుకోదగిన వసూళ్లు రాబడుతోంది. 20 రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో.. అన్ని డేస్‌లో ఈ చిత్రం ఎంత కలెక్షన్లు రాబట్టిందో ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
వారి లెక్కల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 65.98 కోట్లు కొల్లగొట్టింది. అందులో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ. 48.29 కోట్లు కలెక్ట్ చేయడం విశేసం. అంటే.. త్వరలోనే ఈ సినిమా ఏపీ, తెలంగాణాల్లో కలుపుకుని 50 కోట్ల మార్క్‌ని క్రాస్ చేయనుందన్నమాట. అదే జరిగిదే.. బాలయ్య ఖాతాలో మరో రికార్డ్ చేరినట్లే. మొత్తానికి.. క్రిష్ చెప్పినట్లుగానే ఈ చిత్రం బాలయ్య కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
ఏరియాల వారిగా 20 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 11.50
సీడెడ్ : 9.1
ఉత్తరాంధ్ర : 6.90
ఈస్ట్ గోదావరి : 4.34
వెస్ట్ గోదావరి : 4.55
కృష్ణా : 4.16
గుంటూరు : 5.14
నెల్లూరు : 2.6
ఏపీ+తెలంగాణ : రూ. 48.29 కోట్లు
కర్ణాటక : 5.03
రెస్టాఫ్ ఇండియా : 1.96
ఓవర్సీస్ : 10.7
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 65.98 కోట్లు