Gossipsఆ హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ ప్రేమ‌లో ప‌డ్డారా… అస‌లు నిజాలేంటి ?

ఆ హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ ప్రేమ‌లో ప‌డ్డారా… అస‌లు నిజాలేంటి ?

సినిమా ఇండ‌స్ట్రీ అన్నాక ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా ఎవ‌రో ఒక‌రితో లింకులు పెట్టేస్తూ ఉంటారు. హీరోల‌కు, హీరోయిన్ల‌కు మీడియా వాళ్లు కూడా ఊహించుకుంటూ లింకులు పెడుతూ ఉంటారు. అందులో వాస్త‌వ‌, అవాస్త‌వాలు ఎలా ఉన్నా బ‌య‌ట మాత్రం వారిద్ద‌రి మ‌ధ్య ఏదేదో ఉందంటూ ఓ ప్ర‌చారం అయితే జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ఓ ప్ర‌చారం ఇపూడు టాలీవుడ్ క్రేజీ హీరో మీద పడ్దింది.

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే .. అనన్య పాండే తో విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ సినిమా షూటింగ్ తోనే ఆగిపోవడంలేదని..వీళ్ళ మధ్య అంతకు మించిన సంబధం ఏదో ఉందని అటు బాలీవు లో ఇటు టాలీవుడ్ లో ఈ వార్త మారుమ్రోగిపోతుంది. అమ్మడు డెడికేషన్ కి..అందానికి.. క్రేజీ హీరో ప్లాట్ అయ్యాడని.. అంటున్నారు. మరి దీనికి వీరి సమాధనం ఇస్తారా..?? లేదో వేచి చూడాలి..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news