Newsవీరిద్దరి ప్రేమ ఎలా మొదలైందో తెలుసా..వెరీ ఫన్నీ..??

వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైందో తెలుసా..వెరీ ఫన్నీ..??

క్రికెట్‌ ఆటలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాల పాటు కేవలం క్రికెట్‌నే తన ప్రాణంగా భావించిన సచిన్ తన పేరుతో కొన్ని చారిత్రాత్మక రికార్డులను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రిటైర్‌మెంట్ తరువాత సచిన్ తన కొడుకు అర్జున్ టెండుల్కర్‌ను క్రికెట్‌లో రాణింపజేయాలని చూస్తున్నాడు.

భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండుల్క‌ర్ వ‌య‌స్సులో త‌న‌కంటే ఆరే ఏళ్లు పెద్ద‌ది అయిన అంజ‌లిని ప్రేమించి పెళ్లాడాడు. స‌చిన్ స్టార్ క్రికెట‌ర్‌గా కొన‌సాగుతోన్న టైంలో ఆరేళ్లు పెద్ద‌ది అయిన అంజలిని పెళ్లాడ‌డం పెద్ద సంచ‌ల‌నం. అయితే వీరిద్దరు ఎలా కైసారు..?/ ఎప్పుడు కలిసారు..?? అసలు వీరి ప్రేమాయణం ఎలా మొదలైంది..? అనేది చాలా మందికి తెలియదు. ఇక ఈ విషయాలను ఇప్పుడు ఈక్కడ చదివి తెలుసుకుందాం రండి..

సచిన్ టెండూల్కర్ 1990 లో విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వస్తున్న సమయంలో విమానాశ్రయంలో.. అంజలి ని ఫస్ట్ టైం చూసారట. అప్పుడే అంజలి ..సచిన్ కు బాగా నచ్చేసిందట. ఆ తరువాత ఎలాగోలా తన అడ్రెస్ పట్టి..ఫైనల్ గా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ ఒక పార్టీలో మీట్ అయ్యరట. ఇంకేముంది అలా అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి..ఆ పరిచయం స్నేహంగా..ఆ స్నేహం ప్రేమగా మారింది. అసలు షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే.. సచిన్ కి ఉన్న ఫాలోయింగ్ వల్ల తన తల్లికి ఆయనను పరిచయం చేయడం కోసం ఒక జర్నలిస్టు లాగా వెళ్లి ఇంటర్వ్యూ పేరుతో తన తల్లిదండ్రులకు పరిచయం చేసిందట అంజలి. ఇక ఈ జంట 1995 మే 24న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఓక్క పాప..బాబు కూడా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news