Natural Star Nani and Keerthy Suresh starrer Nenu Local movie has completed it’s censor formalities and gets positive feedback from board members.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నేను లోకల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు శరవేగంగా ముగించుకున్న ఈ చిత్రం.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని కూడా కంప్లీట్ చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతోపాటు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉందని, కడుపుబ్బా నవ్వించే కామెడీతో చిత్రాన్ని బాగా తెరకెక్కించారని సెన్సార్ టాక్. అలాగే.. ఎప్పట్లానే నాని తన నేచురల్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడని, కార్తీ సురేష్ కూడా అద్భుత అభియనం కనబరిచిందని, ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదరిందని బోర్డు సభ్యులు వెల్లడించారట. అలాగే.. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఈ విధంగా సెన్సార్ నుంచి మంచి టాక్ రావడంతో.. యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నేను లోకల్’తో నానికి డబుల్ హ్యాట్రిక్ హిట్స్ పక్కా అని నమ్మకం వ్యక్తం చేశారు. కేరక్టర్ బేస్డ్ లవ్ స్టోరీస్ అయిన ‘ఇడియట్’, ‘ఆర్య’ సినిమాల తరహాలోనే ఈ చిత్రం తెరకెక్కిందని.. అందుకే ఈ చిత్రానికి యాటిట్యూడ్ ఈజ్ ఎవరీథింగ్ అనే క్యాప్షన్ పెట్టామన్నారు. నాని ఇందులో ద బెస్ట్‌గా నటించాడని.. కీర్తి మంచి రోల్ పోషించిందని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని.. అంత చక్కగా దర్శకుడు త్రినాథరావు ఈ సినిమాని తెరకెక్కించారని దిల్ రాజు పేర్కొన్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర ఓ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘నేను లోకల్’పై మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. ప్రి-రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.