Gossipsమహేష్ బాబు తన జీవితంలో వాళ్ల ఇద్దరిని మర్చిపోయే ప్రసక్తే లేదు.....

మహేష్ బాబు తన జీవితంలో వాళ్ల ఇద్దరిని మర్చిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకో తెలుసా..??

మహేష్ బాబు-నమ్రత.. చూడ చక్కనైన జంట. టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ కూడా ఒక‌టి. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరిది లవ్ మ్యారెజ్ అనే విషయం మనకు తెలిసిందే. అసలు మహేష్ – నమ్రత మధ్య ప్రేమ ఎలా ? పుట్టింది ఎక్కడ ? చిగురించింది అన్నది ఆసక్తికర విషయమే.

ఈ జంట బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని పాటలు , సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు బి.గోపాల్ ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ చేశారు. ఆ సమయంలో వారిద్దరూ బాగా సన్నిహితులు అయ్యారు. ఎంతలా అంటే.. ఇండియాకు తిరిగి వచ్చాక మహేష్ చాలాసార్లు సీక్రెట్ గా ముంబై వెళ్లి.. న‌మ్ర‌త‌ బేబీని కలిసి వచ్చేవాడిట. ఈ విషయమై అప్పట్లో ప్రముఖ సినీ మ్యాగ‌జైన్‌లో బాగా గాసిప్పులు వచ్చాయి.

ఇలా సాగిన వీరి ప్రేమాయణం..2005 లో భార్యభర్తలుగా మారారు. 2005 వరకు ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2005లో ముంబైలో ఫిబ్రవరి 10న కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అసలు షాకింగ్ ఏమిటంటే.. అప్పట్లో కృష్ణ ఫ్యామిలీ కూడా మహేష్ బాబు పెళ్లి గురించి తెలియదట. వీళ్ళ పెళ్ళి వ్యవహారం అంతా ఇద్దరు బాలీవుడ్ బడా బాబులు చూసుకున్నరనే టాక్ ఇప్పటికి హాట్ టాపిక్ గానే ఉంది.

అప్పటి బాలీవుడ్ సీనియర్ దర్శక, నిర్మాత నటుడు మహేష్ మంజ్రేకర్, హీరో సంజయ్ దత్ వీరి పెళ్లికి ఎంతో సాయం చేశారని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంటాయి. విళ్లిద్దరే మహేష్ బాబు-నమ్రత ల పెళ్ళి తెరవెనుక ఉండి జరిపించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక నమ్రత అటు సంజయ్ దత్ తో పాటు ఇటు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news