Moviesఆ సినిమా చూసి NTR అభిమానులు కొడతారని భయపడ్డారట.. ఎందుకో తెలుసా..??

ఆ సినిమా చూసి NTR అభిమానులు కొడతారని భయపడ్డారట.. ఎందుకో తెలుసా..??

టాలీవుడ్ ఎన్నోసినిమాలు వస్తుంటాయి..పోతుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే మైలు రాయిలా నిలిచిపోతాయి అందులో ఒకటి “గుండమ్మకథ” . తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు అనడంలో సందేహం లేదు. విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సినిమా గుండమ్మ కథ. ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన తెలుగు సినిమా మర్చిపోలేని సినిమా గుండమ్మ కథ.

అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని “గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిద్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి. ఈ సినిమా ఎన్టీఆర్ కి 100 వ చిత్రం కాగా ఏఎన్ఆర్ కి 99 సినిమా కావడం విశేషం.

ప్రముఖ రచయిత డి.వి.నరసరాజు రచించిన ఎన్నో సినిమా కథల‌లో గుండమ్మ కథ సినిమా కూడా ఒకటి. ఇకపోతే అప్పట్లో ఈ సినిమాను విడుదల చేయడానికి పరుచూరి అలాగే డి.వి.నరసరాజు చాలా భయపడ్డారట. ఎందుకంటే.. ఈ సినిమా లో ఎన్టీఆర్ నిక్క‌ర్ తో కనిపిస్తారు. ఇది చూసిన NTR అభిమానులు సినిమా విడుదల చేసాకా.. ఎక్కడ కొడతారో అని భయపడ్డారట.

కానీ..NTR నటనతో ప్రజలను ఆకట్టుకున్నారు.. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. ప్రేక్షకులు మనసారా నవ్వుకున్నారు.. ఇటీవల పరుచూరి పలుకులు అనే పేరుతో ఒక ప్రోగ్రాం ను యూట్యూబ్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఆయన అప్పట్లో తనకున్న అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగా.. ఈ విషయం భయటపడ్డింది. ఇక బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Latest news