Newsఆది ఓ అందమైన అనుభూతి..ఆ కిక్ ని లైఫ్‌లో మర్చిపోలేను..!!

ఆది ఓ అందమైన అనుభూతి..ఆ కిక్ ని లైఫ్‌లో మర్చిపోలేను..!!

కాజల్ అగర్వాల్.. ఆమే టాలీవుడ్ చందమామ. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో నటనతో.. అదృష్టంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది . ‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ.. కాజల్ అగర్వాల్.. తొలి సినిమా అంతగా హిట్‌ కానప్పటికీ…ఈమె యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత నటించిన ‘చందమామ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.. బాడా హీరోస్ తో ..బడా ఆఫర్స్ తో..అంత కనా భారి రెమ్యునరేషన్ తో దూసుకుపోయింది. అబ్బో.. అప్పట్లో ఆమడుకి ఉన్న క్రేజ్ కి .. దర్శకనిర్మాతలకు వేరే హీరోయిన్స్ కనిపించేవారు కాదులేండి. అదృష్టం అలా ఉన్నింది పాపది. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే రాణిస్తోందంటే.. ఆమె అంద అలాంటిది.

అయితే, ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే..గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ జంట సూపర్ హిట్ గా ఉందంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహ‌మాడిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గ‌డుపుతుంది.

అయితే పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన లేటెస్ట్ హిందీ మూవీ ‘ఉమ’ షూటింగ్ ఫినిష్ చేసింది. అయితే చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాపై తన అభిప్రాయం తెలుపుతూ కాజల్..ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ..” ఇలాంటి సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం.షూటింగ్‌ పూర్తయ్యాక కూడా మనల్ని వెంటాడే పాత్రలు కొన్నే ఉంటాయి. అలాంటిదే ఉమ రోల్. ఈ సినిమాలో నటించిన కిక్ లైఫ్‌లో మరువలేనని” కాజల్ ఎమోషనల్ అయ్యింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news