సాధారణంగా టాప్ హీరోలతో సినిమా చేయాలని అందరి డైరెక్టర్లకి ఉంటుంది. అలాంటి చాన్స్ వస్తే చచ్చిన వదులుకోరు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోలతో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ కల. నందమూరి హీరోలతో సినిమా చేయాలంటే అదృష్టంగా భావిస్తారు. నందమూరి హీరోలకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. నందమూరి హీరోలతో సినిమా చేసే అవకాశం కోసం టాప్ దర్శకులు కూడా ఆతౄతగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఆ నందమూరి హీరోనే పిలిచి.. మనం సినిమా చేద్దాం అంటే ఎలా ఉంటాది.. ఏ డైరెక్టర్ అయినా ఎగిరి గంతేస్తారు. చకచక సినిమా పనులు మొదలు పెట్టేదాం అని అనుకుంటారు.
అయితే అలాంటి మంచి అవకాశాని చేతులారా నాశనం చేసుకున్నారు ఓ డైరెక్టర్. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరు అయిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆ డైరెక్టర్ ని పిలిచి మరి చాన్స్ ఇస్తే నో అని చెప్పాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా..? ఆయనే కోదండరామిరెడ్డి…ఇంతకి ఈయన నందమూరి తారక రామారావు గారితో సినిమా ఛాన్స్ ఎందుకు వదులుకున్నాడొ తెలుసా..??
అప్పుడు వరుస హిట్లతో దూకుడు మీద ఉన్న ఏ కోదండరామిరెడ్డిని పిలిచి ..తమిళంలో హిట్ అయిన గౌరవం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారట నందమూరి తారక రామారావు. అయితే.. అప్పటికే కోదండరామిరెడ్డి కొందరు నిర్మాతలకు కమిట్ అవ్వడం తో .. కోదండరామిరెడ్డి ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పితే… ఎన్టీఆర్ కోదండరామిరెడ్డి తో ఓకే బ్రదర్ ముందుగా మీ ప్రాజెక్ట్ లు పూర్తి చేయండి అని అన్నారట. ఇక అలా ఎన్టీఆర్ తో ఛాన్స్ వచ్చినా కోదండరామిరెడ్డి సినిమా చేయలేకపోయాడు.