News2 వేల నోటు రద్దుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మోదీ.. సమయం...

2 వేల నోటు రద్దుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మోదీ.. సమయం లేదు మిత్రులారా!

In a meeting, all india state bank officers union president thomas franco said that PM Narendra Modi is going to ban 2000 note before March 31st.

ప్రధాని నరేంద్రమోదీ రూ.2 వేల నోటును కూడా రద్దు చేస్తారని గతకొన్నాళ్ల నుంచి వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తొలుత ఈ వార్త వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ అంతగా పట్టించుకోలేదు. మొన్నటిమొన్నే అమలులోకి తెచ్చిన ఈ నోట్లను అప్పుడే ఎందుకు రద్దు చేస్తుంది? ఇప్పటికే నోట్ల రద్దుతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ఈలోపే 2 వేల నోట్లను కూడా రద్దు చేస్తే మరింత ఇరకాటంలోకి పడుతుందని, కాబట్టి వాటిని ఇప్పుడిప్పుడే రద్దు చేయదని కొందరు విశ్లేషకులు అభిప్రాయాలు కూడా వినిపించారు. కానీ.. ఎవరేమనుకున్నా ఆ నోట్లను రద్దు చేయడం వాస్తవమని ఓ అధికారి వెల్లడించారు. ఆయన మరెవ్వరో కాదు.. ఆలిండియా స్టేట్‌బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ థామస్ ఫ్రాంకో.

ఈమధ్యే తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగిన అభ్యుదయ రచయిత సంఘంలో పాల్గొన్న ఫ్రాంకో.. ఈ సందర్భంగా రూ.2 వేల నోట్ల రద్దు ప్రస్తావన తీసుకొచ్చారు. మార్చి 31వ తేదీలోగా ఆ నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ ఖచ్చితంగా మరో సంచలనానికి తెరతీస్తారని ఆయన అన్నారు. ఎందుకంటే.. కేంద్రప్రభుత్వం 1000, 500 నోట్లను రద్దు చేసి ఎన్ని విమర్శలు ఎదుర్కుందో, రూ.2 వేల నోటు అమలులోకి తెచ్చి అంతకంటే ఎక్కువ అభాసుపాలయ్యిందని ఆయన చెప్పారు. అంతేకాదు.. సామాన్యులకు చిల్లర దొరకడం చాలా కష్టంగా మారితే, నల్లకుబేరులకు బ్లాక్‌మనీ దాచుకోవడానికి మరింత తేలిక అయ్యిందని ఫ్రాంకో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో.. ఈ 2 వేల నోట్లను రద్దు చేయాలని మోదీ ఫిక్స్ అయ్యారని ఆయన చెబుతున్నారు.

ఇంకా ఫ్రాంకో ఏమన్నారంటే.. ఓ ప్రైవేట్ సంస్థ నివేదిక ప్రకారం కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని, దీనివల్ల సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ నోట్ల రద్దు విషయం ధనవంతులకు ముందే తెలుసని చెప్పిన ఆయన.. దాని కారణంగా చిన్న పరిశ్రమల్లో 25 శాతం కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ నోట్ల రద్దు వల్ల ఆర్బీఐ కూడా తన స్వతంత్రత కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. మార్చి 31 లోగా మోదీ మరో సంచలనానికి దారితీయడం ఖాయమని, ఈ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని ఫ్రాంకో ప్రజల్ని ఉద్దేశించి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news