ఒకప్పుడు తెలుగు సినిమా 50 కోట్ల మార్క్ దాటేందుకే కష్టపడాల్సి వచ్చేది. 50 కోట్లే ఒక రికార్డ్ అన్నట్టుగా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీ 100 కోట్లు కూడా అవలీలగా దాటే రేంజ్ కు వెళ్లింది. బాహుబలి సినిమాతో కలక్షన్స్ లెక్కలన్ని మారిపోయాయి. ఇండస్ట్రీ రికార్డులే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలను తిరగరాసింది బాహుబలి. మొదటి పార్ట్ తెలుగు వర్షన్ 183 కోట్లు తీసుకు రాగా.. కన్ క్లూజన్ ఏకంగా 310 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా రికార్డులను అందుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కానట్టే. ఇక తెలుగులో 100కోట్లు కలెక్ట్ చేసిన తొలితెలుగు సినిమా ఏంటో తెలుసా..??
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తూ తీసిన చిరుత మూవీ బాగా క్లిక్ అయింది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీ తో ఫాన్స్ ఖుషీ అయ్యారు.
అయితే చిరుత మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేసిన మగధీర మూవీతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు.
అంతేకాదు..వందకోట్లు కలెక్ట్ చేసిన తొలితెలుగు మూవీగా మగధీర రికార్డు క్రియేట్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో రామ్ చరణ్ తన నటనతో సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా 2009 జులై 31న రిలీజై.. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. కామెడీ, ఎమోషన్, గ్రాఫిక్స్, ఫైట్స్ అన్నీ కుదిరిన ఈ మూవీ చరిత్ర సృష్టించింది.
ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజు రాత్రి ప్రివ్యూ వేసస్తే, అచ్చం తుపాన్ ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ఆలా ఉన్నిందట. అంతేకాదు ..వరల్డ్ వైడ్ 1200థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 223సెంటర్స్ లో వందరోజులు పూర్తి చేసుకుని అరుదైన ఘనత సాధించింది. 39కోట్ల బడ్జెట్ కి 125కోట్లు గ్రాస్. వంద కోట్లు కలెక్ట్ చేసిన తొలితెలుగు మూవీగా మగధీర నిలిచింది.
అలాగే..కర్నూల్ లో ఒకే థియేటర్ లో వెయ్యి రోజులు ఆడి.. మరో రికార్డ్ క్రియేట్ చేసింది మగధీర. అంతేకాదు.. ఈ సినిమా తమిళంలో డబ్బింగ్ అయి.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ.. కర్ణాటకలో కూడా ఎక్కువ కలెక్షన్ తెచ్చింది మగధీర. ఓవర్సీస్ లో 7న్నర కోట్లు వసూలు చేసి..మరో చరిత్ర సృష్టించింది, 9నంది అవార్డులు రెండు నేషనల్ అవార్డులు,7ఫిలిం ఫేర్ అవార్డులు మగధీర దక్కించుకుంది.