అలనాటి అందాల తార శ్రీదేవి.. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఏకైక నటి. ఆమె బ్రతికి ఉండగానే కూతురిని హీరోయిన్ గా చూడాలని అనుకున్నారు కాని అది జరగలేదు. శ్రీదేవి వారసత్వాన్ని అందుకుని జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దడక్ సినిమాతో జాన్వి మెప్పించిందనే చెప్పాలి. ఇక ఒక సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న జాన్వి గ్లామర్ షోలో తల్లిని మించేలా కనిపిస్తుంది. నెలకో ఫోటో షూట్ తో జాన్వి అదరగొడుతుంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే..శ్రీదేవి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందో అందరికి తెలిసిందే.
ఇక ఈ అందాల తార మన తెలుగులో దాదాపు స్టార్ హీరోస్ అందరితోను జతకట్టింది. ముఖ్యంగా చిరంజీవి-శ్రీదేవి జంట అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషం లో వచ్చిన అని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఆ తరువత హీరో శోభన్ బాబు-శ్రీదేవి జంట ప్రేక్షకూలను బాగా ఎంటర్ టైన్ చేసింది.
ముఖ్యంగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దేవత సినిమా..సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి మైన్ ప్లస్ పాయింట్ పాటలు..ఈ సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా వేటూరి గారు రాసిన “వెళ్లువచ్చి గోదారమ్మ వెల్లాకిలా పడ్డాదమ్మో..” అనే ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడు ఏంటి ఇప్పుడు కూడా ఈ పాట టీవీలో వస్తే చిందులేసేవాళ్ళు ఉన్నరు. అంతలా ఈ పాట ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపేసింది.
అయితే..ఈ పాట రాజమండ్రి దగ్గర అగ్రహారంలో గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ చేసారు. దీంతో..దేవత చిత్రయూనిట్ గోదావరి నదిపై బోటులో ప్రయాణించి.. ఆ తర్వాత అక్కడి నుండి కొంత దూరం బురదలో నడిస్తే గాని లోకేషన్స్ స్పాట్ రాదు. మిగత వాళ్లందరు ఎలాగోలా బురదలో నడిచి లోకేషన్స్ స్పాట్ కి చేరుకున్నరు.
కానీ హీరోయిన్ శ్రీదేవి ఆ బురదలో నడిస్తే వేసుకున్న డ్రేస్ పాడైపోతుందని.. నిర్మాత డి.రామానాయుడు శ్రీదేవిని లొకేషన్ స్పాట్ వరకి ఎత్తుకెళ్లేవారట. అలా ఈ పాట షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారట. ఇక ఈ పాట కోసం బిందెలను రాజమండ్రి నుంచి తెప్పించారట. చివరికి ఈ సినిమా 1982లో విడుదలై టాలివుడ్ బాక్స్ ఆఫిస్ వద్ద అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు కళ్లు ఆర్పకుండా చూస్తారు.