Moviesఈ జంట ఎందుకు విడిపోయిందో తెలిస్తే .. అసలు నమ్మలేరు..!!

ఈ జంట ఎందుకు విడిపోయిందో తెలిస్తే .. అసలు నమ్మలేరు..!!

ఈ రంగుల ప్రపంచం.. సినిమా ఇండస్ట్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల చెప్పండి. మనకు తెలిసిన విషయమే కదా.. ఇక్కడ ఎలా ఉంటుందో. సినిమా రంగంలో లో అట్రాక్షన్ , ఎఫైర్ లు, పెళ్లిళ్లు, ప్రేమలు, విడాకులు చాలా సర్వ సాధారణం. ఈ విష్యం మనకు తెలిసిందే. కొందరు సినిమాలు చేస్తున్న సమయంలోనే లవ్ చెసుకుంటారు. అంతే త్వరగా పెళ్లి చేసుకుంటారు. ఎంత త్వరగా లూడు ముళ్లు వెయ్యించుకుంటరో.. అంతె త్వరగా విడాకులు కూడా తీసుకుంటారు. ఇలా టలీవుడ్ లో చాలా మంది పెళ్లి చేసుకుని..కనీసం ఏడాది అయిన కాకముందే విడిపోయిన జంటలు బోలెడు మంది ఉన్నారు. కాని, వీళ్లలో ముఖ్యంగా మనకు గుర్తు వచ్చేది అక్కినేని మనవడు సుమంత్ , ఒకప్పటి అందాల హీరోయిన్ కీర్తి రెడ్డి .

నిజామాబాద్ కు చెందిన మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు అయిన కీర్తి రెడ్డి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో ఎంత పాపులారిటి సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున తో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ.. రావోయి చందమామ సినిమాలో కూడా నటించింది. ఆ టైంలో అక్కినేని మనవడు సుమంత్ తో ప్రేమలో పడ్డింది. పెద్దలను ఇప్పించి పెళ్లి చేసుకున్నారు.అంతా బాగనే ఉంది అనుకుంటున్న సమయంలో.. పెళ్లయిన ఏడాదికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రి షాక్ అయ్యింది.

అసలు వీరు విడాకులకు తీసుకొవడానికి మైన్ రీజన్.. కీర్తి రెడ్డి సుమంత్ ను సినిమాలు పూర్తిగా వదిలేసి అమెరికా రావలని అడిగిందట. అయితే సమంత్‌ ఇందుకు నో చెప్పాడట. సినిమా రంగాన్ని వదులుకొని అమెరికా రాలేన‌ని తెగేసి చెప్పేశాడ‌ట. అదే టైంలో కీర్తి రెడ్డి .. సుమంత్ కు పెద్దగా హిట్లు లేకపోవడంతో ఆ విషయాన్ని ప్రస్తావించిందట. ఇక అంతే ఆ మాటతో సుమంత్‌ చాలా హ‌ర్ట్ అయ్యడట. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్‌ పెద్దది కావడంతో వారు విడాకులు తీసుకున్నారట. అయితే వీరు విడాకులు తీసుకోవడం మాత్రం ప్రేక్షకులకు ఎంత మాత్రం నచ్చలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వారు విడిపోతుంటే వారి అభిమానులు , ప్రేక్షకులు చూసి తట్టుకొలేకపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news