యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయనకు మంచి వ్యక్తిత్వం, డెడికేషన్, కష్టపడే తత్వం వల్ల సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ”ఆర్ఆర్ఆర్” సినిమా లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేషన్ క్రియేట్ చేశాడు. తెలుగులో భారీ అంచనాలతో వచ్చిన ఈ షో తొలి సీజన్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం.
ఆ మాటకు వస్తే ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజన్లో ఉన్నంత ఊపు మిగిలిన సీజన్లలో లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ ఎనర్జీ, ఛరిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవల్లో నిలబెట్టేశాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక త్వరలోనే ఎన్టీఆర్ ”ఎవరు మీలో కోటీశ్వరుడు” షో కూడా ప్రారంభం కానుంది. ఇక ఆయనకు ఇష్టమైన ఆహారం విషయానికి వస్తే , వాళ్ళ అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టమట. ఇక ముఖ్యంగా నాటుకోడి కూర , రొయ్యల బిర్యానీ తో పాటు కోడి కూర వేపుడు అంటే చాలా ఇష్టం గా తింటూ ఉంటారు ఎన్టీఆర్.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు.