ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇక వారికీ సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా హీరోయిన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తున్నాం.. కానీ వారు చిన్నప్పుడు ఎలా ఉంటారో అని ప్రతి ఒకరికి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ఈ చిన్నారి హీరోయిన్ ని గుర్తు పట్టడం కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో ఒక్కసారి చూద్దాం. ఈ ఫొటోలో ఉన్నది ఓ రౌడీ బేబీ.. ఆ సన్నని నడుముతో నాట్యం చేస్తే నెమలి డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర సుందరి. ఇక ఈ క్లూతో అయినా ఈ చిన్నారి హీరోయిన్ ని గుర్తించారా?.. యస్…మీరు అనుకున్నది నిజమే.. ఈ ఫోటోలో ఉన్నది మన రౌడీ బేబీ సాయి పల్లవి.
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజ్ టాలీవడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. మారి 2 చిత్రంలో మరోమారు తన డాన్సింగ్ స్కిల్స్ ని బయట పెట్టింది.
ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా రానా నటిస్తున్నారు. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోనూ నటిస్తుంది.