Controversial director Ram Gopal Varma makes sensational comments on Mahesh Babu via twitter.
రాంగోపాల్ వర్మ.. ఏదైనా ఒక చిన్న ఛాన్స్ దొరికితే చాలు, అవతలి వ్యక్తిని ఊది అవతల పడేస్తాడు. చిన్నాపెద్దా, హీరోనా-పొలిటీషియనా అని చూడడు.. బుర్రలోకొచ్చింది తన పిట్ట ద్వారా కూతలు కూయించేస్తాడంతే. ఇప్పుడు మనోడు సూపర్‌స్టార్ మహేష్‌బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉన్నట్లుండి ప్రిన్స్‌ని వర్మ ఎందుకు టార్గెట్ చేశాడనేగా మీ సందేహం..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘ప్రత్యేకహోదా’ కోసం వైజాగ్‌లో మౌనపోరాటానికి దిగారు. వీరికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తోపాటు మరెందరో మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే అతని జపం చేస్తున్న రాంగోపాల్ వర్మ.. మహేష్‌ని సీన్‌లోకి లాగాడు. అతడ్ని ఈ మేటర్‌లోకి తీసుకురావడానికి ఓ బలమైన కారణం ఉందిలెండి. తమిళనాడులో ‘జల్లికట్టు’ బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. దానికి వ్యతిరేకంగా అక్కడి యువత భారీఎత్తున ఉద్యమం చేపట్టింది. అందుకు ఎందరో సెలబ్రిటీలతపాటు మహేష్ సైతం మద్దతు పలికాడు. తమిళ తంబీలు సంప్రదాయంగా భావించే ‘జల్లికట్టు’ ఆటని రద్దు చేయడం సరికాదని.. బ్యాన్ ఎత్తివేయాలంటూ ట్వీట్ చేశాడు. అలాంటి మహేష్.. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీ ప్రజలకు మద్దతుగా ఎందుకు గళం ఎత్తడం లేదని వర్మ అతనిపై విరుచుకుపడ్డాడు.
‘ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ప్రజలకు కాకుండా తమిళ్ కల్చర్‌ని మహేష్‌బాబు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నిజానికి.. అతనికి సూపర్‌స్టార్ హోదా కల్పించిందే ఏపీ ప్రజలు. అలాంటిది.. ఏపీ సమస్యలపై కాకుండా డబ్బింగ్ మార్కెట్ ప్రజలకు మద్దతుగా మహేష్ నిలవడం షాకింగ్‌గా ఉంది. పవన్ కళ్యాణ్‌లాగా ఏపీ ప్రజల్ని మహేష్ పట్టించుకోవడం లేదా? ఏ సెలబ్రిటీ అయినా సరే.. పవన్ పోరాటానికి మద్దతు పలకని సెలబ్రిటీ ‘ద్రోహులు’గా పరిగణించబడతారు. మహేష్ ఫ్యాన్స్.. మీరు కూడా అతనికి పవన్ ఫైట్‌కి వెనకాల నడవమని చెప్పుకపోతే.. మీరూ ద్రోహుల కిందకే వస్తారు’ అంటూ నిప్పులు చెరిగాడు వర్మ. ఇంకా మనోడు మహేష్‌ని టార్గెట్ చేసి.. చాలానే మాటలన్నాడు.
Why @urstrulyMahesh supporting some Tamil festival culture more than survival problems of AP ? Becos he’s not as caring as @PawanKalyan ?
— Ram Gopal Varma (@RGVzoomin) 25 January 2017
Shocked @urstrulyMahesh is more bothered about dubbing market people than survival problems of actual people who made him super star
— Ram Gopal Varma (@RGVzoomin) 25 January 2017
Any celebrity if they don’t immidiatley don’t join @PawanKalyan in his fight for the people’s problems they are criminal traitors of AP
— Ram Gopal Varma (@RGVzoomin) 25 January 2017
If @urstrulyMahesh fans don’t tell him to back @PawanKalyan ‘s fight for AP’s struggle they also are as big traitors of AP as him
— Ram Gopal Varma (@RGVzoomin) 25 January 2017
if @urstrulyMahesh is not into politics why he so bothered about Tamil jallikattu and not about @PawanKalyan ‘s fight for AP problems?
— Ram Gopal Varma (@RGVzoomin) 25 January 2017