Balayya’s prestigious 100th project Gautamiputra Satakarni 2 weeks worldwide collections report is out. According to trade, Balayya has reached another feat.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బుధవారం (25-01-2017)తో రెండు వారాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్‌ని వెల్లడించాయి. వారి లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో రూ.60.99 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో.. బాలయ్య తొలిసారి 60 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయారు. నిజానికి.. చాలామంది హీరోలు 50 కోట్ల క్లబ్లో చేరారు కానీ.. 60 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ అవ్వలేకపోయారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ రేర్ ఫీట్‌ని అందుకోగలిగారు. తాజాగా బాలయ్య కూడా ఆ జాబితాలో చేరిపోయారు.
ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రెండు వారాల్లో రూ. 43.38 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషమని అంటున్నారు. అదికూడా ‘ఖైదీ’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాల భారీ పోటీమధ్య అంతమొత్తం కలెక్ట్ చేయడం చెప్పుకోదగిన విషయమే. ఏ అంచనాలతో అయితే ఇది విడుదల అయ్యిందో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది కాబట్టే ఇలా వసూళ్ల వర్షం కురిపిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి.. ఈ సినిమా బాలయ్య కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా ఉంది.
ఏరియాల వారీగా 14 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 11.52
సీడెడ్ : 7.89
ఉత్తరాంధ్ర : 5.52
ఈస్ట్ గోదావరి : 3.85
వెస్ట్ గోదావరి : 4.10
కృష్ణా : 3.60
గుంటూరు : 4.60
నెల్లూరు : 2.30
ఏపీ+తెలంగాణ : రూ. 43.38 కోట్లు
కర్ణాటక : 4.78
రెస్టాఫ్ ఇండియా : 1.75
ఓవర్సీస్ : 11.08
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 60.99 కోట్లు