సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలు వివిధ వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ సందడి చేస్తుంటారు.ఈ విధంగా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారు పలు రకాల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు.ఈ విధంగా పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలు సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమాలలో నటించినందుకు కోట్లకు కోట్లు తీసుకునే హీరోలు యాడ్స్ కి కూడా కోట్లు తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకే ఒక్క యాడ్ లో చేసాడు. మహేంద్ర కంపెనీకి చెందిన టియువి 300కార్ కి సంబంధించిన యాడ్ లో చేసినందుకు రెండు కోట్లు అందుకున్నట్లు చెబుతుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో యాడ్ కి రెండు కోట్లకు పైగా అందుకుంటాడని టాక్. ఇక విక్టరీ వెంకటేష్ ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ లో కనిపించే కింగ్ నాగార్జున కోటిన్నర వరకూ తీసుకున్నాడని టాక్.అలాగే నాగచైతన్య ఒక్కో యాడ్ కి 70లక్షల వరకూ అందుకుంటున్నాడు. ఇక మన ఆరు అడుగుల అందగాడు రానా ఒక్కో యాడ్ కి కోటి రూపాయలు తీసుకున్నాడని టాక్. అక్కినేని అఖిల్ హీరోగా రాకముందే యాడ్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో యాడ్ కి 50 లక్షలు అందుకున్నాడట.
ఇక సాధారణంగా మన భారతదేశంలోని ప్రముఖ టీవీ ఛానళ్లలో రాత్రి వేళ 8 గంటల నుంచి 11 గంటల మధ్య సమయంలో 30 సెకండ్ల నిడివిగల ప్రకటన ఇవ్వాలంటే 50 వేల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఈ లెక్కన చూసుకుంటే.. అత్యంత పాపులర్ అయిన ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానళ్లలో మూడు నిమిషాల నిడివిగల అడ్వర్టైజ్మెంట్ ప్రసారం చేసినందుకు 3 – 30 లక్షలు రూపాయలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్స్ కి రాత్రి సమయంలో వీక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో మన ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెలరోజుల పాటు ప్రతిరోజు ఎనిమిది సార్లు 30-60 సెకండ్ల నిడివిగల ప్రకటన టీవీ ఛానల్లో ప్రసారం కావాలంటే 3 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పాపులారిటీని బట్టి ప్రకటనలకు అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుంది.