Healthరికార్డు స్థాయిలో పెరిగిన చికెన్, మటన్ ధరలు.. రీజన్ తెలిస్తే షాకే..!!

రికార్డు స్థాయిలో పెరిగిన చికెన్, మటన్ ధరలు.. రీజన్ తెలిస్తే షాకే..!!

కోడి మాంసం ధర మళ్లీ పరుగులు తీస్తోంది. ఒక్కసారిగా మాంసాహారం ధరలు పెరిగాయి. కొన్నాళ్ల క్రితం బర్డ్‌ ఫ్లూ ప్రచారంతో దిగొచ్చిన ధర ఆ భయం తొలగిపోవడంతో తిరిగి పుంజుకుంది. దీంతో కొద్ది రోజుల నుంచి మళ్లీ బ్రాయిలర్‌ కోడి మాంసం రేటు ఎగబాకుతోంది. కరోనా నుంచి రక్షించుకోవాలంటే బలవర్థకమైన ఆహారం తినాలని వైద్యులు సూచించడంతో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో కోడి మాంసం ధర పెరిగింది.

సహజంగా మాంసాహార ప్రియులు వారికి ఇష్టమైన మాంసాన్ని తింటారు. ప్రధానంగా కొనుగోలు చేసే చికెన్, మటన్, చేపల ధరలను వ్యాపారులు పెంచారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి చికెన్, చేపలు. ఈ రెండింటి ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. కిలో రూ.180 వరకు పలుతున్న చికెన్‌ ధరను ప్రాంతాన్ని బట్టి రూ.250 నుంచి రూ.280 వరకు విక్రయించారు. అదేమిటంటే డిమాండ్‌ అలా ఉందని చికెన్‌ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. గ్రామాల్లో కన్నా నగరాలు, పట్టణాల్లో చికెన్‌ ధర అధికంగా ఉంది.

హైదరాబాద్‌లో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలే ఆదివారం. ఆషాఢ మాసం.. పైగా బోనాల సందడి. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. కోడి మాంసం కిలో రూ.270, మేక మాంసం ధర కిలో రూ.750కు చేరింది. అయినా మాంసాహార ప్రియులు షాపుల ముందు పెద్ద ఎత్తున వరుస కట్టడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news