ఆదిత్య 369.. టాలీవుడ్ మర్చిపోలేని సినిమా. బాలయ్య కెరిర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ సినిమా కూడా.టాలీవుడ్ చరిత్రను తీసుకుంటే.. అందులో ఎప్పటికీ చెరిగిపోని.. ఇంకెప్పటికీ తెరకెక్కించలేని.. ఆ సాహసం చేయలేని చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి వరుసలో ఉండే చిత్రమే ఆదిత్య 369. అలాంటి చిత్రం మళ్లీ తెరకెక్కించడం అంటే ఆషామాషీ కాదు. అప్పటి వరకు చూడని ఎన్నో విశేషాలను, అద్భుతాలను ఈ చిత్రం ద్వారాతెలుగులో చూపించారు. ఇండియాలో మొదటి సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంగా ఆదిత్య 369 రికార్డులు క్రియేట్ చేసింది.
గడియారం గిర్రున వెనక్కి తిరిగితే… ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావచ్చు… గిర్రున ముందుకు తిరిగితే… ఫ్యూచర్‌ని చూడొచ్చు. ఇంగ్లిష్ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్‌నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. టైమ్ మిషన్ నేపథ్యంలో అప్పటి వరకు భారతీయ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో వచ్చిన ఈ సినిమా క్లాస్ నుండి మాస్ వరకు అందిరినీ మెప్పించింది. హాలీవుడ్‌లో వచ్చిన ‘‘బ్యాక్ టూ ఫ్యూచర్’’ అనే మూవీ కాన్సెప్ట్ ను మన నేటివిటికి తగ్గట్టు అత్యద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ సింగీతం. ఒక మనిషి భవిష్యత్తులోకి లేదా గతంలోకి ప్రయాణిస్తే ఎట్ల వుంటదనే కాన్సెప్టే ఆదిత్య 369 స్టోరీ. పదహారో శతాబ్థానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయల వైభవాన్ని ఆనాటి స్వర్ణయుగాన్ని చాలా అందంగా తెరకెక్కించారు.
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. టైమ్ మెషీన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి మూల స్తంభాలైన సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్, పేకేటి రంగా, తరుణ్‌ల మనోగతాన్ని మన ముందుకు తీసుకొచ్చింది.