Moviesఈ భామలు పెళ్లి అంటే పారిపోతున్నారు.. ఎందుకో తెలుసా..??

ఈ భామలు పెళ్లి అంటే పారిపోతున్నారు.. ఎందుకో తెలుసా..??

పెళ్లి మాట ఎత్తగానే అందరూ సంతోషిస్తారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ముఖ్యంగా ముదిరిపోక ముందే పెళ్లి చేసుకోవాలి. వయసైపోయాక పెళ్లి చేసుకుంటే ముఖాలు చూసుకుంటూ గడిపేయాల్సిందే. గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్స్ పెళ్లి అంటే అమ్మో అప్పుడేనా అంటారు.వయసు మూడు పదులు దాటిపోతున్నా పెళ్లి చేసుకోరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి బాటపడుతున్నారు. లాక్డౌన్ సమయం నుండి వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీ దృష్టి – ప్రేక్షకుల దృష్టి పెళ్లి వయసు దాటిపోయిన హీరోయిన్స్ పై పడింది. సాధారణంగా అమ్మాయిలకు పాతికేళ్లు రాగానే ముందుగా అందరూ అడిగే ప్రశ్న ‘పెళ్లెప్పుడు..?’ అని. హీరోయిన్స్ అంటే అందం చందం బాగానే కాపాడుకుంటారు కాబట్టి 30 ఏళ్ల వరకు కూడా పెళ్లికి అవకాశం ఉంటుంది. కానీ టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు. నలభై ఏళ్ళు దగ్గిర పడినా పెళ్లికాని మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చుద్దామా..!!

అనుష్క శెట్టి: ‘సూపర్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క ప్రస్తుత వయస్సు 39ఏళ్ళు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన అనుష్క.. ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తలేదు.

త్రిష: ఇండస్ట్రీలో 20 పూర్తి చేసుకున్నా ఇప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అప్పట్లో వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో కొంతకాలం పాటు డేటింగ్ చేసిన త్రిష అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కొన్నిరోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత త్రిషని ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా సమాధానం దాటవేస్తూ వచ్చింది.

నయనతార: లేడీ సూపర్ స్టార్ కు మూడుపదులు వయసు దాటి 5 ఏళ్లవుతోంది. ఈ వయసులో కూడా ఇప్పటికీ చెరిగిపోని అందంతో చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. మరి ఈ పెయిర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుందేమో చూడాలి.

శృతిహాసన్: ఈ భామకు ప్రస్తుతం 35 ఏళ్ళు. శృతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హల్చల్ చేస్తూ చాలాసార్లు కనిపించింది. ఈ క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతి హాసన్.. ఈ మధ్య అతనితో బ్రేకప్ చెప్పి కెరీర్ మీద ఫోకస్ చేసింది. ప్రస్తుతం క్రాక్ సినిమా కంబ్యాక్ హిట్ తో ఫామ్ కొనసాగిస్తుంది.

తమన్నా భాటియా: ఈ భామకు ప్రస్తుతం 32ఏళ్లు. పదహారేళ్ళకే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ.. పెళ్లి ఎప్పుడని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే చేతినిండా తెలుగు తమిళ హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది.

నిత్యమేనన్: ఈ భామకు ప్రస్తుతం 33ఏళ్లు. కానీ ఇప్పటివరకు పెళ్లి గురించి అడిగితే జరిగే టైంలోనే జరుగుతుంది అంటూ సమాధానం చెబుతోంది.

ఇలియానా: ఈ గోవా బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మడి వయసు 34ఏళ్లు. కానీ ఇప్పటివరకు పెళ్లి జీవితం పై క్లారిటీ లేదు.

తాప్సీ: హీరోయిన్ తాప్సీకి ప్రస్తుతం 33ఏళ్లు. ఎప్పుడో ‘ఝమ్మందినాదం’ అనే మూవీతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ ఇప్పటికే 12ఏళ్లకు పైగా కెరీర్ పూర్తి చేసుకుంది. కానీ మూడుపదులు మీదపడినా పెళ్లి పై క్లారిటీ ఇవ్వలేదు.

రకుల్ ప్రీత్ సింగ్: సౌత్ టు నార్త్ వరకు బిజీగా గడుపుతోంది ఈ 31ఏళ్ల సుందరి. ఇంతవరకు పెళ్లి లైఫ్ గురించి స్పందించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news