Moviesఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?? కొంచెం కష్టమే.. కానీ ట్రై చేయండి..!!

ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?? కొంచెం కష్టమే.. కానీ ట్రై చేయండి..!!

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అనే విషయం మనకు తెలిసిందే. ఈ రంగుల లోకంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం..ఊహించలేం. సినిమాల్లో ఫేమ్ రాగానే సరోపోదు.. ఆ ఫేమ్ ని కాపాడుకోవాలి..అనేది సత్యం. అవకాశాలు వస్తున్నంత కాలం మనల్ని అందరూ గుర్తు పెట్టుకుంటారు..ఆ తర్వాత క్రమక్రమంగా ఆడియన్స్ మనల్ని పట్టించుకోవడమే మానేస్తారు..అలా ఇండ్రస్టీ లో ఒకప్పుడు మంచి ఫేమ్ తెచ్చుకొని..స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఆ తర్వాత దూరమైన హీరోయిన్లలో ‘గజాలా’ఒకరు.. !!

హీరోయిన్ గజాలా గుర్తుందా? కొంచెం కష్టమనే చెప్పాలి. తెలుగు తెరకు గుడ్ బై చెప్పి తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీలోకి వెళ్లిపోయింది ఈ సుందరి. నాలో ఉన్న ప్రేమ అంటూ ఇంట్రడక్షన్ తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన గజాలా.. చాలా కాలం పాటు సౌత్‌లో మెరిసింది.

ఒకప్పుడు గజాల తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. “నాలో ఉన్న ప్రేమ” సినిమా ద్వారా గజాల తెలుగునాట తెరంగ్రేటం చేసారు. జూనియర్ ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ 1 ” లో నటించి అదరగొట్టింది. ఈ సినిమా తోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.గజాల తెలుగునాట చాలా సినిమాలే చేసింది. కలుసుకోవాలని, స్పీడ్ ట్రాక్, అల్లరి రాముడు, ఓ చిన్నదాన, రామ్, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, జానకి వెడ్స్ శ్రీరామ్, భద్రాద్రి, మద్రాసి, శ్రావణ మాసం, విజయం, వంటి సినిమాలు చేసింది. ఇవి కాకుండా, తమిళ్, మలయాళం లలో కూడా గజాల సినిమాలు చేసింది.

రంగుల ప్రపంచం సృష్టించిన పరిస్థితుల్లో పడి ఆమె మరణం అంచుల వరకు వెళ్ళొచ్చింది. ఎంత వేగం గా పాపులర్ అయిందో.. అంతే వేగం గా కనుమరుగైపోయింది. ఇండస్ట్రీ లో ఓ యువ హీరో ప్రేమ మాయలో పడి..అతను మోసం చేశాడంటూ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, అదృష్టవశాత్తు ఆ గండం నుంచి గట్టెక్కింది. ఇలా జరిగిన తరువాత గజాల మళ్ళీ తెరపై కనిపించలేదు. లవ్ ఫెయిల్యూర్ వ్యధ నుంచి బయటపడ్డ గజాల మళ్ళీ సినిమాలలో చేయలేదు.

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన గజాలా.. చాలా కాలం పాటు సౌత్‌లో మెరిసింది. తెలుగు, తమిళంలో కలిసి దాదాపు 28 సినిమాల్లో నటించింది. నటనని వదిలేసి తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీలోకి వెళ్లిపోయింది. సినిమాలు వదిలేసాక.. ఆమె ముంబై కి వెళ్ళిపోయింది. అక్కడ, టివి నటుడు ఫైజల్ రాజా ఖాన్ తో గజాల కు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమ గా మారి వారిద్దరూ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు ప్రేమించుకున్న తరువాత వీరిద్దరూ 2016 లో పెళ్లి చేసుకున్నారు. గజాల కూడా సినిమాలకు స్వస్తి పలికి భర్త దర్శకత్వం లో సీరియల్స్ లో నటించాలని భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news