Movies‘శాతకర్ణి’ 11 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఏరియాల వారీగా వివరాలు

‘శాతకర్ణి’ 11 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఏరియాల వారీగా వివరాలు

Balayya’s 100th film Gautamiputra Satakarni 11 days worldwide collections report is out. According to trade, this film has earned well in the second weekend.

సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. బరిలో మరో రెండు సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ.. వాటికి ధీటుగా ఊహించని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వీక్ డేస్‌లలో డీసెంట్ వసూళ్లు రాబడుతూ.. వీకెండ్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. రెండో వారాంతంలోనూ ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ సంతృప్తికరమైన కలెక్షన్లు కలెక్ట్ చేసింది. దీంతో.. డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 11 రోజుల్లో రూ. 55.13 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా రూ.38.68 కోట్లు కొల్లగొట్టింది. ‘ఖైదీ నెం.150’, ‘శతమానం భవతి’ సినిమాల పోటీమధ్య కూడా ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లతో దూసుకెళ్లడం నిజంగా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి అన్నిఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం వల్లే ఇలా భారీ పోటీలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఏరియాల వారీగా 11 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 11
సీడెడ్ : 6.90
వైజాగ్ : 5.30
గుంటూరు : 3.95
ఈస్ట్ గోదావరి : 3.72
వెస్ట్ గోదావరి : 3.26
కృష్ణా : 2.78
నెల్లూరు : 1.77
ఏపీ+తెలంగాణ : రూ.38.68 కోట్లు
యూఎస్ఏ+రెస్టాఫ్ వరల్డ్ : 10.70
కర్ణాటక : 4.55
రెస్టాఫ్ ఇండియా : 1.50
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 55.13 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news