సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం చాలా అరుదు.. కానీ హీరోయిన్స్ డైరెక్టర్స్ ని చేసుకోవడం మాత్రం కామన్. అందుకే ఎంతో మంది హీరోయిన్లు-డైరెక్టర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా తీసి అదే డైరెక్టర్ ని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంది. అయితే ఇండ్రస్టీలో. అలా డైరెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..!!
కృష్ణవంశీ-రమ్యకృష్ణ : పెళ్ళికి ముందు రమ్యకృష్ణ, కృష్ణవంశీ దర్శకత్వంలో నటించకపోయినప్పటికీ ఇద్దరూ తరచూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవడం ద్వారా దగ్గరయ్యారు. తర్వాత భార్యాభర్తలయ్యారు.
రాధికా – ప్రతాప్ పోథేన్: ఎన్నో తమిళ్, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసిన రాధికా తమిళ్ లో ప్రతాప్ పోథేన్ దర్శకత్వంలో కొన్ని సినిమాలు చేశారు. అలా వారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ తనతో మూడేళ్లు అయ్యాక విడాకులు తీసుకొని రిచర్డ్ హార్డీ ని పెళ్లి చేసుకున్న రాధిక అతనితో కూడా విడాకులు తీసుకొని శరత్ కుమార్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.
సెల్వమణి-రోజా : రోజా సినిమాల్లో హీరోయిన్ గా మంచి ఫామ్లో ఉన్న సమయంలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న సెల్వమణితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.
అమల పాల్ – విజయ్: తమిళ్ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకున్న అమలా పాల్ పెళ్లి జరిగిన కొన్ని నెలలకే విడాకులు తీసుకుంది.
సోనియా అగర్వాల్ – సెల్వ రాఘవన్: 7/G బృందావనం సినిమాలో సెల్వ రాఘవన్ తో కలిసి వర్క్ చేసిన సోనియా ఆ సినిమా తరువాత పెళ్లి చేసుకుంది. కానీ ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు. రేవతి – సురేష్ మీనన్ 1996 లో సురేష్ మీనన్ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఈ మధ్య అంటే 2013లో విడాకులు తీసుకొని సెపరేట్ గా ఉంటున్నారు.
మణిరత్నం-సుహాసిని : టాలీవుడ్ టాప్ యాక్ట్రస్ లో ఒకరైన సుహాసినిని స్టార్ డైరెక్టర్ అయిన మణిరత్నం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
సూర్యకిరణ్-కళ్యాణి : కేరళలో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన డైరక్టర్ సూర్యకిరణ్ ని పెదబాబు సినిమా షూటింగ్ లొకేషన్లో కలిశారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ స్టోరీ పెళ్లి పీటలవరకు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.
ఖుష్బూ – సుందర్: ఇద్దరు కలిసి పెద్దగా సినిమాలు చెయ్యలేదు కానీ 1995లో ప్రేమిని పెళ్లి చేసుకున్నారు.
శరణ్య – పొన్ననన్: నటి శరణ్య కూడా ప్రముఖ తమిళ నటులు,దర్శకులు అయినా పొన్ననన్ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు.