శివాజీ రాజా.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందరికి తెలిసిన వ్యక్తే.ఎన్నో సినిమాలో నటించి.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన శివాజీ రాజా.. దాదాపు40 ఏళ్ల ప్రస్థానం అతనిది. వందల సినిమాలలో నటించిన ఆయన నిర్మాతగా, హీరోగా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గాను పని చేశాడు.
ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బొబ్బిలి రాజా సినిమాలో మొదటగా నటించారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో పేకాట పాపారావు,పెళ్లి సందడి పెళ్లి పీటలు, ప్రేమంటే ఇదేరా, జోకర్, నెంబర్ వన్, వినోదం, సిసింద్రీ, ఖడ్గం, సముద్రం, డాడీ, నిన్నే ప్రేమిస్తా, మురారి, ఇలా నటిస్తున్న అటువంటి క్రమంలో ప్రముఖ నటుడు రంగనాథ్ దర్శకత్వంలో మొగుడు పెళ్ళామ్స్ అనే చిత్రంలో శివాజీ రాజా హీరోగా నటించాడు.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలిపోయింది. కొద్ది సంవత్సరాల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనదైన వినోదం పంచిన శివాజీ రాజా రాను రాను నటనకు దూరమయ్యాడు. మా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పలు వివాదాలతో ఆయన పేరు నిత్యం వార్తలలో ఉండేది.
ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ టాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోతున్నారు. విజయ్ గ్రాడ్యూయేషన్ పూర్తయిందని హైదరాబాద్లోని ఓ ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నట్లు శివాజీ రాజా మీడియా ద్వారా వెల్లడించారు. తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయడానికి పలువురు దర్శకులతో చర్చించి ఫైనల్ గా ఓ సినిమాకు కమిట్ అయ్యారు. దీంతో శివాజీ రాజా కొడుకు వినయ్ రాజా హీరో అయ్యాడు. ఇప్పటికే ఈయన హీరోగా జెమ్ అనే సినిమా వచ్చింది. అది పెద్దగా విజయం సాధించలేదు.
ప్రస్తుతం ఈ కుర్రాడు రెండో సినిమాతో వస్తున్నాడు. వేయి శుభములు కలుగు నీకు అనే టైటిల్ తో వస్తున్నాడు . ఇంతకాలం మీడియాకు దూరంగా ఉన్న శివాజీ రాజా తన తనయుడు వినయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘వేయు శుభములు కలుగు నీకు’ సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన బరువు తగ్గి చిక్కిపోయి కనిపించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది.
గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చినప్పటికి తన ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక వేయి శుభములు కలుగు నీకు సినిమాతో అయిన తన కుమారుడిని నిలబెట్టాలని శివాజీ రాజా భావిస్తున్నాడు.