బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు. కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు.
ఈ సీరియల్ మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీరియల్తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది.
అయితే ఈ సీరియల్ ఒక శుభవార్తను తీసుకు వచ్చింది. కార్తీక దీపం సీరియల్ చూసేవారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.వంటలక్క కార్తీకదీపం సీరియల్ నెట్ఫ్లిక్స్లో రాబోతుందట. ఆశ్చర్యంగా ఉందే..వంటలక్క ఓటిటైలోనా.. అని అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే కార్తీకదీపం సీరియల్ ఓటీటీ నెంబర్ 1 కంటెంట్ లో తోపు అయినా నెట్ఫ్లిక్స్లో 5 ఏళ్ళ సీరియల్ సినిమాలా రానుందని.. అందుకే వంటలక్క కూడా మలయాళం సీరియల్ కు సిద్ధం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయ్. కానీ ఇటీవల కాలంలో ఏ సీరియల్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సందడి చేయలేదు.
కానీ ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ NETFLIX లో ప్రసారమవుతుంది అనే వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. మరి వంటలక్క కార్తీకదీపం సీరియల్ నిజంగానే సినిమాలా నెట్ఫ్లిక్స్లో వస్తుందా.. లేక ఇది ఒక పుకారేనా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సీరియల్ సినిమాలా నెట్ఫ్లిక్స్లో వస్తే వంటలక్క అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది అనడంలో సందేహం లేదు. ఈ విషయం పై సీరియల్ దర్శకుడు గాని, నిర్మాతగాని, అందులో నటించే సభ్యులు ఎవరు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.