Moviesపెళ్లి దాకా వచ్చి బ్రేకప్ అయిన జంటలు ఇవే..!!

పెళ్లి దాకా వచ్చి బ్రేకప్ అయిన జంటలు ఇవే..!!

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని మన పెద్దలు చెప్తుంటారు. బహుశా ఇది చూస్తే అవి నిజమే అనిపిస్తుంది. ఆ దేవుడు ఎవరికి ఎవరిని ముడి పెడతారో ముందే రాసేస్తారు. ఈమధ్య ప్రేమలు పెళ్లిళ్లు దాకా వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చొని క్యాన్సిల్ అవ్వడం సంచలనం గా నిలుస్తుంది. ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు.

నిశ్చితార్ధం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతున్నాయి.ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లు తమ ప్రేమను పెళ్లిళ్లు గా మార్చుకోవడంలో విఫలమయ్యారు. అలా పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఎవరేవరో ఇప్పుడు చూద్దాం…

రష్మిక – రక్షిత్ శెట్టి:

వరుస సినిమాలతో టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన రష్మికకు ఆల్రెడీ కన్నడ నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. గతంలో వారికి ఎంగేజ్మెంట్ కాగా తన కెరీర్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

త్రిష-వరుణ్ మణ్యన్‌:

సౌత్‌లో దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అయిన త్రిష, ప్రముఖ బిజినెస్‌మ్యాన్ వరుణ్ మణ్యన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. జనవరి 2015లో వరుణ్, త్రిషాల ఎంగేజ్‌మెంట్ జరగగా… సరిగ్గా ఐదు నెలల తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది త్రిష.

అఖిల్ – శ్రీయ భూపాల్:

నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రీయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ 2016 లో పెద్దల సమక్షంలో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయ్యింది.

నయనతార-ప్రభుదేవా:

నయనతార హీరో శింబుతో బ్రేకప్ తర్వాత అప్పటికే పెళ్లైన ప్రభుదేవాని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం దాకా వెళ్లింది. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాల నుంచి తప్పుకోవాలని కూడా నిర్ణయించుకుంది నయన్. అయితే పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత ప్రభుదేవా, తన మొదటి భార్యా కూతుళ్ల గురించి ఆలోచించడంతో… నయన్‌కి మరోసారి మనసు బద్ధలైంది. నిశ్చితార్థం ముక్కలైంది. ప్రభుదేవాతో చేసుకున్న నిశ్చితార్థం రద్దయిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్న నయన్, ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఉదయ్ కిరణ్-సుష్మిత :

హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ప్రేమించుకున్నారు. వీరిద్దరికి 2003 లో పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఎంగేజ్ మెంట్ జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు.

శృతి హాసన్-మైకేల్‌:

శృతి హాసన్ కూడా అమెరికన్ మైకేల్‌ క్రోసలేతో ప్రేమాయణం నడిపింది…వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. మైకేల్‌తో పెళ్లి కోసం తనకి వచ్చిన ఆఫర్లను కూడా పక్కనబెట్టేసింది శృతీ. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మైకేల్‌తో విడిపోయినట్టు ప్రకటించింది శృతి హాసన్.

మెహ్రీన్ – భవ్య భిష్ణోయ్:


తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ మెహరీన్ వివాహం కూడా క్యాన్సిల్ అయ్యింది. భవ్య భిష్ణోయ్ ను ఎంగేజ్మెంట్ చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది ఈ హీరోయిన్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news