ఎమ్ఎమ్.కీరవాణి అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతం తెలిసిన అతికొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఆయన ఒకరు. ఇండస్ట్రీలో సాంకేతిక నిపుణులకు అందే పారితోషికం అందరూ ఊహించుకునే దానికంటే తక్కువే ఉంటుంది. అందులోనూ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అయిన సంగీత దర్శకులతో మహా అయితే 2 కోటి – 5 కోట్లు మరీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే 7-9 కోట్ల దాకా ఉంటుంది. బడ్జెట్ ను బట్టి ఈ రెమ్యునరేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం టాప్ ఫామ్ లో కొనసాగుతున్న థమన్ మాత్రం తక్కువకే పనిచేస్తున్నాడు. అందుకే దర్శకులు, నిర్మాతలకు థమన్ టాప్ ప్రయారిటీ అయ్యాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ శరవేగంగా షూటింగు జరుపుకుంటోంది. పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. . దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాతీయ స్థాయి తారలు నటిస్తున్నారు. ఇక మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
అయితే తాజాగా కీరవాణి గురించి ఓ వార్త సినీ ఇండస్ట్రిలో చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే.. RRR మూవీకి కీరవాణి భారీగా పారితోషకం అందుకుంటున్నాడట. కీరవాణి పారితోషికం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. RRR మూవీకి కీరవాణి అక్షరాలా 16 కోట్లు ఛార్జ్ చేస్తున్నారుట. ఒకవేళ అదే నిజమైతే కిరవాణి మరో రికార్డ్ సృష్టించిన్నట్లే అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఎందుకంటే.. దేశంలో ఏ. ఆర్ రెహమాన్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి రికార్డు క్రియేట్ చేస్తాడు. అదీ సౌత్ లో అయితే కొన్నాళ్ల పాటు ఆయన పేరు రికార్డుల్లో నిలిచి పోతుందనడంలో సందేహం కూడా ఉండదని అంటున్నారు.
ఇక మూవీ మ్యాటర్ లోకి వస్తే .. ఆర్ ఆర్ ఆర్ కు రాజమౌళితో పాటు తన ఫ్యామిలీలో చాలా మంది పనిచేస్తున్న విషయం తెల్సిందే. వీరందరికీ విడివిడిగా కాకుండా ఒక ప్యాకేజ్ లా పారితోషికం అందుతుంది. అందులోనుండి వాటాలు వేసుకుంటారు. ఆర్ ఆర్ ఆర్ కు రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ కు బడ్జెట్ కన్నా డబల్ లెవెల్లో బిజినెస్ జరుగుతోంది. హీరోలతో పాటు రాజమౌళి కూడా భారీగా వెనకేసుకోనున్నాడు.