Moviesఆ ఒక్క మాటతో వాళ్ళ నోటి దూల తీర్చేసిన సునీత..!!

ఆ ఒక్క మాటతో వాళ్ళ నోటి దూల తీర్చేసిన సునీత..!!

సింగర్ సునీత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ యేడాది మొదట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనిని ఈమె రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సునీత రెండో వివాహాం చేసుకోవడంపై కొంత మంది పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ కొద్దిగా ఎత్తి పొడిచారు.

ఏమైనా సునీత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అందరు అభినందించారు. అయితే సునీత పెళ్ళి పట్ల చాలామంది నెగిటివ్ గా మాట్లాడుకున్నా.. ఆమె మాత్రం పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాని చాలా సంధర్భాల్లో చెప్పింది. రామ్ కూడా తనను ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటున్నాడని చెప్పింది.

సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పెళ్ళైనప్పటి నుండి తన భర్తతో తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేశారు.తన పెళ్ళి ఫోటోలు, తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోల్ని తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. కొంత మంది సునీత రెండో పెళ్లి మీద నెగెటివ్ కామెంట్ చేసినా కూడా.. సమాజంలో మెజార్టీ భాగం తమ మద్దతును తెలిపారు.

అలా సునీత రెండో పెళ్లి ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే వచ్చింది. పెళ్లి జరిగాక కూడా కొంతమంది నెగెటివ్ కామెంట్లు చేస్తూనే వచ్చారు. కానీ సునీత ఏనాడూ కూడా వాటిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఈ మధ్య సునీత ఓ నెటిజన్ స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు.

అయితే రీసెంట్ గా ఓ నెటిజన్ సునీత, రామ్ వీరపనేని కలిసి ఉన్న ఓ ఫోటోకి కమెంట్ చేశారు. “గ్రాండ్ ఫాదర్ అండ్ ఆంటీ” అంటూ వారి ఫోటోకి కమెంట్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి సునీత స్పందిస్తూ.. రిటర్న్ కమెంట్ చేశారు. ఈ పోస్ట్ లో “గాడ్ బ్లెస్ యూ నాన్న.. బుర్ర మాత్రమే కాదు, నువ్వు మనిషిగా కూడా ఎదగాలి. నీ కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. వారిని దేవుడు దీవించాలి” అంటూ పోస్ట్ చేసింది సునీత. అయితే సునీత ఇచ్చిన రిప్లైకు నెటిజన్ల మద్దతు లభించింది. అందరూ కూడా ఆ నెటిజన్‌ను తిడుతూ సునీతకు సపోర్ట్ చేశారు. అలా ఎప్పుడూ కూడా సునీతకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తూనే ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news