సినిమా అనగానే మనకు రకరకాల వినోదం గుర్తొస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రావడం మనదేశంలో చాలా తక్కువ. అందులోనూ తెలుగులో మరీ తక్కువ. కుటుంబ కథా చిత్రాలు.. ప్రేమ కథా చిత్రాలు.. కామెడీ సినిమాలు ఇలానే తెలుగు సినిమా ఉండేది. 90 వ దశకంలో సినిమా అంటే ఇంచుమించు ఇలానే ఉండేవి. కానీ మణిరత్నం ఆ మూస ధోరణి నుంచి ఒక్కసారిగా వాస్తవ ఘటనల ఆధారంగా దేశంలో తాజా పరిస్థితుల నేపధ్యంతో సినిమాలు తీశారు. వాటిలో అపురూపమైన సినిమా బొంబాయి.
1992లొ జరిగిన ముంబయి అల్లర్లలో ప్రజల ఇబ్బందులని కళ్ళకు కట్టినట్టు చూపించారు మణిరత్నం. ఈ సినిమాలో మొదటగా హీరో విక్రమ్ ను కలవడం జరిగింది. అప్పటికి తాను గడ్డం మీసాలతో ఉండడం చూసిన మన మణిరత్నం అవి తీయించుకొని సినిమాలో నటించాలని కోరగా.. విక్రమ్ దానికి ఒప్పుకోలేదు. అలా ఆ ఆఫర్ రోజా తో పాప్యులర్ అయిన సినిమాలో హీరోగా నటించిన అరవింద్ స్వామికి వెళ్ళింది.
ముంబాయి లాంటి సిటీలో ఉండే ప్రజా జీవితంలో ఉండే వైరుధ్యాలను కళ్ళకు కట్టినట్టు ప్రతి ఫ్రేం లోనూ చూపించారు మణిరత్నం. ఈ సినిమాకి అదే బలం. ఇలా చెబుతూ పొతే ముంబాయి సినిమాలోని ప్రతి సన్నివేశం గొప్పతనమూ చెప్పుకోవాల్సిందే.
అందుకే బొంబాయి సినిమా ఇప్పుడు చూసినా అదే గిలిగింత..అంతే ఉద్వేగం..అంతకు మించి మంచి సినిమా చూసిన అనుభూతి మనకు కలిగి తీరుతుంది. వీలయితే కాదు .. వీలు చూసుకుని ఈ సినిమా చూడండి. మణిరత్నం, ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ కి మీరు ఫిదా అవడం ఖాయం.
1995 మార్చి 10న విడుదలైన బొంబాయి సినిమా దేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమయ్యింది. హైదరాబాదులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను మూసివేయడం జరిగింది. బొంబాయి సినిమా అన్ని నిభాషల్లోను విడుదలై ఘన విజయాన్ని సాధించింది.