Moviesకాసుల వర్షం కురిపించిన మన తెలుగు సినిమాలు ఇవే..!!

కాసుల వర్షం కురిపించిన మన తెలుగు సినిమాలు ఇవే..!!

తెలుగు సినిమా టాకీ నుంచి మొదలు పెడితే.. డిజిటల్ వరకు ఎన్నో సినిమాలు తెలుగు తెరపై అలరించాయి. అలాంటి చిత్రాల్లో కొన్ని మాత్రమే అత్యంత ప్రేక్షకాదరణ పొందుతాయి. అంతేకాదు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు లేదా ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాయి. అల తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇప్పటి వరకు టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే..!

బాహుబలి:
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2015 లో వచ్చిన బాహుబలి. ఈ సినిమాను రూ.125 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఒక ఊహించని విధంగా 650 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2017 లో వచ్చిన బాహుబలి 2 సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఎవరూ ఊహించని విధంగా రూ.1607 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ రికార్డులను బ్రేక్ చేసేసింది. ఇక కేవలం తెలుగులోనే రూ.325 కోట్ల షేర్ ను రాబట్టింది.

అలా వైకుంఠపురములో:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను 84 కొట్లతో నిర్మించారు. మొత్తం 160 కొట్ల కలెక్షన్స్ సాధించింది.

అత్తారింటికి దారేది:
పవన్ కళ్యాణ్ హీరోగా , త్రివిక్రమ్ దర్శకత్వంలో 2013లో విడుదలైన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం కూడా తెలుగులో రూ.77 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

సరిలేరు నీకెవ్వరు :
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా విజయశాంతి ప్రధాన నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను 100 కొట్లతో నిర్మించారు. మొత్తం 144 కొట్ల కలెక్షన్స్ సాధించింది.

మగధీర:
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిత్రం మగధీర. ఇక తన రెండవ చిత్రం అయిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోల లిస్టులో కి ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ చిత్రం కూడా తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్ల షేర్ ను రాబట్టింది.

రంగస్థలం:
సుకుమార్, రామ్ చరణ్ కాంబో లో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను 80 కొట్లతో నిర్మించారు. మొత్తం 110.72 కొట్ల కలెక్షన్స్ సాధించింది.

సింహాద్రి:
2003లో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘సింహాద్రి’ సినిమా దాాదాపు రూ. 37 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది

పోకిరి:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం పోకిరి. ఈ చిత్రం రూ.40 కోట్ల షేర్ ను రాబట్టింది.

భరత్ అనే నేను:
కొరటాల శివా, మహేష్ బాబు కాంబో లో వచ్చిన భరత్ అనే నేను సినిమా Above Avg.ఈ సినిమాను 99.2 కొట్లతో నిర్మించారు. మొత్తం 96.30 కొట్ల కలెక్షన్స్ సాధించింది.

ఇంద్ర :
2002 వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. ఈ చిత్రం కూడా రూ.29 కోట్ల షేర్ ను రాబట్టింది.

నువ్వే కావాలి:
2000లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన ‘నువ్వే కావాలి’ సినిమా రూ. 19 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news