సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. రజినీకాంత్ మూవీ ‘అన్నాత్తే’ దీపావళికి విడుదల అవుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. మరి అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? కదా? అని సందేహం నెలకొన్న వేళ.. అభిమానులకు సన్ పిక్చర్స్ గుడ్‌న్యూస్ చెప్పింది.
మొదటి నుంచి ఈ సినిమాపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ ‘అన్నాత్తే’ సినిమాను దీపావళికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తయింది. ప్రస్తుతం దర్శకుడు శివ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. అయితే రజనీకాంత్ కు ఇక్కడ ఓ సమస్య వచ్చి పడ్డింది. తెలుగులో ఈ సినిమాని విడుదల చేసేకి టైటిల్ కోసం వెతుకుతున్నారు. అన్నాత్తే చిత్రానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలలోని ఒక పాత సినిమా టైటిల్ ను తీసుకోవాలని చూస్తున్నారట.
ముఖ్యంగా ఈ సినిమాకి తెలుగులో అర్థం”అన్నయ్య”. అందుకనే రజినీకాంత్ ఈ సినిమానీ తెలుగులో “అన్నయ్య” అనే సినిమా పేరుతో విడుదల చేయాలని చూస్తున్నారు. అన్నయ్య అనే టైటిల్ తో చిరంజీవి పాత సినిమా ఒకటి ఉంది. ఈ పేరుని పెట్టుకుంటే ఎక్కువ పాపులర్ చేయాల్సిన పని ఉండదు. కానీ సినిమా మూవీ మేకర్స్ మాత్రం “పెద్దన్నయ్య”అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ ఈ సినిమా పేరు మీద ముందుగానే బాలకృష్ణ నటించాడు. ఇప్పుడు రజిని ఈ రెండు సినిమా పేర్లల్లో ఏది ఫైనల్ చేస్తాడో చూడాలి మరి..