తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పిన మహానటుడు ఎన్టీఆర్. సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక ఆయన భార్య బసవతారకం గైనిక్ క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ తర్వాత చాలా రోజులు రాజకీయాల్లో బిజీ అయిన ఆయన ఆయన జీవిత చరమాంకంలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది పిల్లలు. వీరిలో ఏడుగురు కుమారులు.. నలుగురు కుమార్తెలు.
ఇక ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓడిపోయి 1994 ఎన్నికలకు సిద్ధమవుతోన్న సమయంలో మేజర్ చంద్రకాంత్ సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేయడంతో పాటు జనాలను ఉర్రూతలూగించి… ఎన్టీఆర్‌పై అఖిలాంధ్ర జనానికి ఉన్న ప్రేమను చాటి చెప్పింది. ఇక దాదాపు ఎన్టీఆర్ సినిమాలకు దూరమైన సమయంలో ఈ సినిమా చేయడానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్ తన భార్య పేరు మీద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని అనుకుంటున్నానని.. ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే.. వారి సినిమాలో చేస్తానని చెప్పారట.
వెంటనే మోహన్‌బాబుకు ఎన్టీఆర్‌తో ఉన్న చనువు నేపథ్యంలో మోహన్ బాబు వెంటనే ఎన్టీఆర్‌ను కలిసి ఈ సినిమా చేయమని చెప్పారు. అప్పుడు మోహన్ బాబు సైతం వరుస ప్లాపులతో ఉన్నారు. చివరకు కె. రాఘవేంద్రరావు దర్శకుడిగా.. మోహన్ బాబు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎన్నో మరపురాని మధురానుభూతులు మిగల్చడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.