ఎన్.టి.రామారావు గారి వారసత్వంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్. తన నటనతో, డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సౌత్ ఇండియా హీరోల్లో డ్యాన్స్ మాట వస్తే మొదటగా ఎన్టీఆర్ పేరే గుర్తొస్తుంది. తన 19 సంవత్సరాల వయసులోనే టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టి సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పటికీ అలాగే తన సినిమాలతో మాస్, క్లాస్ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.
ఎన్టీఆర్ తీస్తున్న సినిమాలు వరుస ఫ్లాపులు, ఎలాంటి మూవీ చేయాలో అని సతమతమవుతున్న సందర్భం, అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నానే అని అనుకుంటున్న సమయంలో పూరి జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమా అన్ని సందేహాలను తీర్చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా..కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సినిమా “టెంపర్”.
వక్కతం వంశీ రాసిన కధ ఇది. ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే డిఫరెంట్‌గా నిలిచింది. తారక్‌లోని నటుడ్ని ఈ సినిమాతో వెలికితీసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అంతేకాదు ఎన్టీఆర్‌లోని నెగిటివ్ షేడ్స్‌ని ఈ చిత్రం ఆవిష్కరిచంది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ కూడా చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.”నా పేరు దయ నాకు లేనిదే అది” అనే డైలాగ్ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ని తీసుకొచ్చింది.
నటుడిగా ఎన్టీఆర్‌ను మరో మెట్టు పైకెక్కించింది ‘టెంపర్’ మూవీ . ‘ఆంధ్రావాలా’ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ‘టెంపర్’ మూవీలో ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన టెంపర్ మూవీ ఫిబ్రవరి 13, 2015 సంవత్సరం లో రిలీజయి కమర్షియల్ గా సూపర్ సక్సెసయింది.
సిక్స్ ప్యాక్ తో, స్టైలిష్ గా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ప్రెజెంట్ చేసి ఎన్టీఆర్ నందమూరి అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తోనే నడిపించారని చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం గా 41.19 రూపాయల షేర్ ను రాబట్టింది.
ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ భార్య “లక్ష్మీ ప్రణీత ” సగం వరకు చూసి “ఎందుకు చేసావ్ ఇలాంటి సినిమా అని”ప్రశ్నించారట. కానీ ఎన్టీఆర్ సినిమాను పూర్తిగా చూడమని తెలపడంతో.. సినిమా చూసిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారింది.