Moviesరక్తం కారుతున్న మిర్చి తిన్న ఎన్టీఆర్ ..రిజన్ తెలిస్తే దండం పెట్టాల్సిందే..!!

రక్తం కారుతున్న మిర్చి తిన్న ఎన్టీఆర్ ..రిజన్ తెలిస్తే దండం పెట్టాల్సిందే..!!

ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, పోతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. వెండితెరపై అందాల రాముడైనా … కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది.

కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.

పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ‘అన్న’ ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్.

ఎన్టీఆర్ తొలి ఇరవై ఏళ్లలోనే 200 సినిమాలు చేసారు. యేడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి.వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. ఈ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించాడు. అంతర్నాటకాల్లో కలపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో కనిపించారు.తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.

ఎదురీత .. ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన విజయవంతమైన హిందీ చిత్రం అమానుష్ ఆధారంగా తెలుగులో ఎన్. టి. ఆర్ హీరోగా నిర్మించబడింది. ఎక్కువభాగం చిత్రం ఔట్ డోర్ లో తూర్పు గోదావరి లంక గ్రామాల్లో చిత్రీకరింపబడింది.

ఎదురీత షూటింగ్ సమయంలో ఓ ఆశ్చరయ కరమైన సంఘటన చోటుచేసుకుందట. షూటింగ్‌ లో భాగంగానే యానాంలో సముద్రంపై ఎన్టీఆర్‌.. సత్యనారాయణ మీద ఓ ఫైట్‌ సీన్‌ చిత్రీకరిస్తున్నారు.

ఆ సమయంలో అనుకోకుండా ఓ ఇనుప రాడ్డు ఎన్టీఆర్‌ ముఖానికి గట్టిగా తగిలిందట. గాయం పెద్దది కావడంతో రక్తం బాగా కారుతుంటే.. అక్కడున్న వారంతా కంగారుపడ్డారట. వెంటనే షూటింగ్‌ ఆపేసి ఒడ్డుకు చేర్చారట.

అయితే అదే సమయంలో అక్కడ ఎవరో మిరపకాయలు ఆరబోసి ఉంటే..వాటిని తీసుకుని నోట్లోవేసుకుని కచకచ నమిలేసి.. హా.. ఇంక పదండి వెళ్లదాం.. షూటింగ్ కంటిన్యూ చేద్దాం అని అన్నారట రామారావు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారట. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంది.


నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం అంతా కలిపితే పద్నాలుగేళ్లు కూడా ఉండదు. అంత తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వాళ్లు మరొకరు లేరు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

అయినా, తెలుగుదేశం పార్టీకి గట్టి సిద్ధాంత పునాది కల్పించారు. రాష్ట్రాల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. కేంద్రం పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కమ్యూనిస్టులు, భాజపా నేతలను ఒకతాటి మీదకు తీసుకువచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news